Emayyaa rattusese vimtagum galamaa nemu

ఏమయ్యా రట్టుసేసే వింతకుఁ గలమా నేము
Language

(॥పల్లవి॥)
ఏమయ్యా రట్టుసేసే వింతకుఁ గలమా నేము
జాముజాముకు నిన్ను జరసేటివారమా

(॥ఏమ॥)
చనవియ్యఁగానీతోసరి మాటాడితిఁగాక
కినిసితే నిన్ను పలికించగలమా
వనితలము కొసరేవార మింతేకాక
పెనఁగి బత్తిగొట్టానఁబెట్టఁగలమా

(॥ఏమ॥)
చెక్కు నొక్కఁగా నీతో సెలవి నవ్వితిఁగాక
దిక్కరించితే వోజకుఁ దేఁగలమా
ఇక్కువనున్నవారముఇచ్చాడఁగలముగాక
గుక్కక వట్టివేడుక కొనవేయఁగలమా

(॥ఏమ॥)
నీవే నన్నుఁ గూడఁగాను నిండుకవుండితిఁగాక
దేవరవలె నుంటే బోదించఁగలమా
శ్రీవేంకటేశ నేము సిగ్గుతోవారము గాక
వోవరిలోపలిపొందు వొడిఁబెట్టఁదగునా

(||pallavi||)
emayyā raṭṭusese viṁtagum̐ galamā nemu
jāmujāmugu ninnu jaraseḍivāramā

(||ema||)
sanaviyyam̐gānīdosari māḍāḍidim̐gāga
kiniside ninnu paligiṁchagalamā
vanidalamu kŏsarevāra miṁtegāga
pĕnam̐gi battigŏṭṭānam̐bĕṭṭam̐galamā

(||ema||)
sĕkku nŏkkam̐gā nīdo sĕlavi navvidim̐gāga
dikkariṁchide vojagum̐ dem̐galamā
ikkuvanunnavāramuichchāḍam̐galamugāga
gukkaga vaṭṭiveḍuga kŏnaveyam̐galamā

(||ema||)
nīve nannum̐ gūḍam̐gānu niṁḍugavuṁḍidim̐gāga
devaravalĕ nuṁṭe bodiṁcham̐galamā
śhrīveṁkaḍeśha nemu siggudovāramu gāga
vovarilobalibŏṁdu vŏḍim̐bĕṭṭam̐dagunā