Emayyaa needo naagu nemta mamdemelamu

ఏమయ్యా నీతో నాకు నెంత మందెమేళము
Language

(॥పల్లవి॥)
ఏమయ్యా నీతో నాకు నెంత మందెమేళము
నీ మోము చూచుకుండుటే నిధానముగాదా

(॥ఏమ॥)
చనవిచ్చితినంటాను జాణతనాలాడేదా
వినయముతో నీమాట వినుటగాక
చెనకితివంటాను చేతులు పైఁజాఁచేదా
మనసెరిఁగి మొక్కుటే మంచిదిగాక

(॥ఏమ॥)
కై దండ వట్టితివంటాఁ గాళ్ల నిన్నుఁ దొక్కేదా
ఆదెస నీదయగల్తే నయ్యీఁగాక
సాదనంటాఁ బొగడితే చన్నులు దాఁకించేదా
పోదితో గర్వములేక పొదుగుటగాక

(॥ఏమ॥)
కలసితివంటా బింకముతోడఁ బెనఁగేదా
మెలుపునీరతులకు మెచ్చుటగాక
అలమేల్మంగను నేను అట్టే శ్రీవేంకటేశ్వర
తలఁపులో మెలఁగుటే తగవుగాక

(||pallavi||)
emayyā nīdo nāgu nĕṁta maṁdĕmeḽamu
nī momu sūsuguṁḍuḍe nidhānamugādā

(||ema||)
sanavichchidinaṁṭānu jāṇadanālāḍedā
vinayamudo nīmāḍa vinuḍagāga
sĕnagidivaṁṭānu sedulu paim̐jām̐sedā
manasĕrim̐gi mŏkkuḍe maṁchidigāga

(||ema||)
kai daṁḍa vaṭṭidivaṁṭām̐ gāḽla ninnum̐ dŏkkedā
ādĕsa nīdayagalde nayyīm̐gāga
sādanaṁṭām̐ bŏgaḍide sannulu dām̐kiṁchedā
podido garvamulega pŏduguḍagāga

(||ema||)
kalasidivaṁṭā biṁkamudoḍam̐ bĕnam̐gedā
mĕlubunīradulagu mĕchchuḍagāga
alamelmaṁganu nenu aṭṭe śhrīveṁkaḍeśhvara
talam̐pulo mĕlam̐guḍe tagavugāga