Emayyaa needaya yennamtigayyaa

ఏమయ్యా నీదయ యెన్నఁటికయ్యా
Language

(॥పల్లవి॥)
ఏమయ్యా నీదయ యెన్నఁటికయ్యా
దీమస మిచ్చి చెలియఁ దెలుపవద్దా

(॥ఏమ॥)
చెక్కులపైఁ జెమటలు చెలికిఁ గారఁగాఁ జూచి
వెక్కసపు సురటిని విసరవద్దా
అక్కజమై నీతో మాటలాడి అలయఁగాఁ జూచి
యిక్కడఁ గప్రపుఁబలు కియ్యవద్దా

(॥ఏమ॥)
సందడిఁ జెంపలవెంట జారిన నెరులు చూచి
ముందుముందే యీచెలికి ముడువవద్దా
చెంది నీకుఁగాఁ గరఁగి సిగ్గువడఁగాఁ జూచి
అందుకొని సేదదీర్చి అసరేఁచవద్దా

(॥ఏమ॥)
కప్పుచు బాగా లిచ్చి కాఁగిలించే చెలిఁ జూచి
దప్పివాయ మోవి యిచ్చి తనుపవద్దా
ఇప్పుడే శ్రీవేంకటేశ ఇంతసేసి కూడితివి
ముప్పిరిసంతోసా లిట్టె ముంచవద్దా

(||pallavi||)
emayyā nīdaya yĕnnam̐ṭigayyā
dīmasa michchi sĕliyam̐ dĕlubavaddā

(||ema||)
sĕkkulabaim̐ jĕmaḍalu sĕligim̐ gāram̐gām̐ jūsi
vĕkkasabu suraḍini visaravaddā
akkajamai nīdo māḍalāḍi alayam̐gām̐ jūsi
yikkaḍam̐ gaprabum̐balu kiyyavaddā

(||ema||)
saṁdaḍim̐ jĕṁpalavĕṁṭa jārina nĕrulu sūsi
muṁdumuṁde yīsĕligi muḍuvavaddā
sĕṁdi nīgum̐gām̐ garam̐gi sigguvaḍam̐gām̐ jūsi
aṁdugŏni sedadīrsi asarem̐savaddā

(||ema||)
kappusu bāgā lichchi kām̐giliṁche sĕlim̐ jūsi
dappivāya movi yichchi tanubavaddā
ippuḍe śhrīveṁkaḍeśha iṁtasesi kūḍidivi
muppirisaṁtosā liṭṭĕ muṁchavaddā