Emayyaa nee veṟamgavaa yimdaru(ri?)vamtidaananaa

ఏమయ్యా నీ వెఱఁగవా యిందరు(రి?)వంటిదాననా
Language

(॥పల్లవి॥)
ఏమయ్యా నీ వెఱఁగవా యిందరు(రి?)వంటిదాననా
కామించి మన్ననఁ బొందే కాంతను నేను

(॥ఏమ॥)
కలికితనాలు చూపి కాయకపుమాఁట లాఁడి
తళుకునఁ బొలసేటి దాననా నేను
పిలిచి పీఁట వెట్టి ప్రియములెల్లాఁ జెప్పి
వలచి వలపించేటి వనితను నేను

(॥ఏమ॥)
ననుపులు పచరించి నవ్వులూరకె నవ్వి
తనియక యలయించేదాననా నేను
వినయములెల్లాఁ జేసి వేడుకలు నీకుఁ జూపి
పెనఁగి పెనఁగించేప్రియురాలను నేను

(॥ఏమ॥)
నిగిడి శ్రీవేంకటేశ నిన్నుఁగూడి కాఁగిటిలో
తగవులు విన్నవించేదాననా నేను
మొగి నన్ను నేలితిని ముందుముందుగానే నిన్నుఁ
దగిలి తగులుసేసే తరుణిని నేను

(||pallavi||)
emayyā nī vĕṟam̐gavā yiṁdaru(ri?)vaṁṭidānanā
kāmiṁchi mannanam̐ bŏṁde kāṁtanu nenu

(||ema||)
kaligidanālu sūbi kāyagabumām̐ṭa lām̐ḍi
taḽugunam̐ bŏlaseḍi dānanā nenu
pilisi pīm̐ṭa vĕṭṭi priyamulĕllām̐ jĕppi
valasi valabiṁcheḍi vanidanu nenu

(||ema||)
nanubulu pasariṁchi navvulūragĕ navvi
taniyaga yalayiṁchedānanā nenu
vinayamulĕllām̐ jesi veḍugalu nīgum̐ jūbi
pĕnam̐gi pĕnam̐giṁchepriyurālanu nenu

(||ema||)
nigiḍi śhrīveṁkaḍeśha ninnum̐gūḍi kām̐giḍilo
tagavulu vinnaviṁchedānanā nenu
mŏgi nannu nelidini muṁdumuṁdugāne ninnum̐
dagili tagulusese taruṇini nenu