Emayyaa nee suddulu yettu deliyamgavachchu

ఏమయ్యా నీ సుద్దులు యెట్టు దెలియఁగవచ్చు
Language

(॥పల్లవి॥)
ఏమయ్యా నీ సుద్దులు యెట్టు దెలియఁగవచ్చు
వేమరును మన్నించేవు వేడుకతో నన్నును

(॥ఏమ॥)
పిలిచి న న్నాదరించి పెండెము చేతి కిచ్చేవు
తొలు తెవ్వతె వెట్టిన తొడవో యిది
తలఁచుక వచ్చి నాకు తమ్ములమిడవచ్చేవు
పొలఁతి యవ్వతె తొల్లి పుక్కిటఁ బెట్టినదో

(॥ఏమ॥)
పట్టుమని పూవులబంతి మీఁద వేసేవు
ముట్టి యెవ్వతె కొప్పున ముడిచినచో
పెట్టెఁడేసి చీరలు ప్రియముతో నిచ్చేవు
గట్టిగా నెవ్వతె యివి గట్టి విడిచినవో

(॥ఏమ॥)
చప్పరమంచముపై నీ సరుసఁ బెట్టుకొనేవు
చిప్పిల నెవ్వతె నీతోఁ జెందియున్నదో
యప్పుడె శ్రీవేంకటేశ యెనసి మోవి యిచ్చేవు
ముప్పిరి నెవ్వతె యాని పిప్పిగాఁ జేసినదో

(||pallavi||)
emayyā nī suddulu yĕṭṭu dĕliyam̐gavachchu
vemarunu manniṁchevu veḍugado nannunu

(||ema||)
pilisi na nnādariṁchi pĕṁḍĕmu sedi kichchevu
tŏlu tĕvvadĕ vĕṭṭina tŏḍavo yidi
talam̐suga vachchi nāgu tammulamiḍavachchevu
pŏlam̐ti yavvadĕ tŏlli pukkiḍam̐ bĕṭṭinado

(||ema||)
paṭṭumani pūvulabaṁti mīm̐da vesevu
muṭṭi yĕvvadĕ kŏppuna muḍisinaso
pĕṭṭĕm̐ḍesi sīralu priyamudo nichchevu
gaṭṭigā nĕvvadĕ yivi gaṭṭi viḍisinavo

(||ema||)
sapparamaṁchamubai nī sarusam̐ bĕṭṭugŏnevu
sippila nĕvvadĕ nīdom̐ jĕṁdiyunnado
yappuḍĕ śhrīveṁkaḍeśha yĕnasi movi yichchevu
muppiri nĕvvadĕ yāni pippigām̐ jesinado