ఏమయ్యా నే నటువంటి యెరవులదాననా
(॥పల్లవి॥)
ఏమయ్యా నే నటువంటి యెరవులదాననా
వోముచు నప్పటి నన్ను వొడఁబరచేవు
(॥ఏమ॥)
మనసు చూడవలసి మాటాడ కూరకుండితే
కినిసితి నంటా వచ్చి కేలువట్టేవు
చనపు మెరసి నిన్ను జంకించి చూచితేను
పెనఁగుచు నాకు నెంతో ప్రియముచెప్పేవు
(॥ఏమ॥)
తమి రేచవలసి నేఁ దలవంచుకొంటేను
అమరఁ గోపించెనంటా ఆయాలంటేవు
భ్రమఇంచవలసి నేఁ బంతములాడుకొంటే
చెమటచేతుల నన్నుఁజెక్కునోక్కేవు
(॥ఏమ॥)
బలిమిఁ గూడవలసిపానుపుపై నుండితేను
అలిగినజాడలంటా నాదరించేవు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్నింతలో
వలపెక్కుడాయనంటా వన్నెమోవిచ్చేవు
(||pallavi||)
emayyā ne naḍuvaṁṭi yĕravuladānanā
vomusu nappaḍi nannu vŏḍam̐barasevu
(||ema||)
manasu sūḍavalasi māḍāḍa kūraguṁḍide
kinisidi naṁṭā vachchi keluvaṭṭevu
sanabu mĕrasi ninnu jaṁkiṁchi sūsidenu
pĕnam̐gusu nāgu nĕṁto priyamusĕppevu
(||ema||)
tami resavalasi nem̐ dalavaṁchugŏṁṭenu
amaram̐ gobiṁchĕnaṁṭā āyālaṁṭevu
bhrama̮iṁchavalasi nem̐ baṁtamulāḍugŏṁṭe
sĕmaḍasedula nannum̐jĕkkunokkevu
(||ema||)
balimim̐ gūḍavalasibānububai nuṁḍidenu
aliginajāḍalaṁṭā nādariṁchevu
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nanniṁtalo
valabĕkkuḍāyanaṁṭā vannĕmovichchevu