ఏమయ్యా నవ్వుమనేవు యెంత చప్పనా
(॥పల్లవి॥)
ఏమయ్యా నవ్వుమనేవు యెంత చప్పనా
కామించితే సిగ్గులు గాడిఁగట్టవచ్చునా
(॥ఏమ॥)
చెంతనుండి యాపెనీకు సేవలెల్లాఁ జేయఁగాను
కాంత వేరోకతే పొత్తుఁ గలయుటెట్టు
ముంతలముంచినయట్టి మోహములు చల్లఁగాను
వంతులకుఁ గొసరేటివనితయుఁ గలదా
(॥ఏమ॥)
మనసుమర్మ మెరిఁగి మాట లాపె యాడఁగాను
వెనుకొని వేరొకతె వినుట యెట్టు
పెనఁగి పెనఁగి నీతోఁ బెనుసరసాలాడఁగ
గునిసి బంతికి వచ్చి కొమలియుఁ గలదా
(॥ఏమ॥)
మలయుచు నలమేలుమంగ యాపె గూడఁగాను
లలి వేరోకతె నీకు లాఁచుట యెట్టు
మెలఁగి శ్రీవేంకటేశ మెచ్చి నన్ను నేలితివి
పిలువక మెలఁగేటి పేరటాలు గలదా
(||pallavi||)
emayyā navvumanevu yĕṁta sappanā
kāmiṁchide siggulu gāḍim̐gaṭṭavachchunā
(||ema||)
sĕṁtanuṁḍi yābĕnīgu sevalĕllām̐ jeyam̐gānu
kāṁta verogade pŏttum̐ galayuḍĕṭṭu
muṁtalamuṁchinayaṭṭi mohamulu sallam̐gānu
vaṁtulagum̐ gŏsareḍivanidayum̐ galadā
(||ema||)
manasumarma mĕrim̐gi māḍa lābĕ yāḍam̐gānu
vĕnugŏni verŏgadĕ vinuḍa yĕṭṭu
pĕnam̐gi pĕnam̐gi nīdom̐ bĕnusarasālāḍam̐ga
gunisi baṁtigi vachchi kŏmaliyum̐ galadā
(||ema||)
malayusu nalamelumaṁga yābĕ gūḍam̐gānu
lali verogadĕ nīgu lām̐suḍa yĕṭṭu
mĕlam̐gi śhrīveṁkaḍeśha mĕchchi nannu nelidivi
piluvaga mĕlam̐geḍi peraḍālu galadā