ఏమయ్యా నా సేవ లెస్స యీడేరెనా
(॥పల్లవి॥)
ఏమయ్యా నా సేవ లెస్స యీడేరెనా
ఆముకొన్న నీ తలఁపు లానతియ్యవయ్యా
(॥ఏమ॥)
నిద్దిరించవలె నంటా నేఁ బాదము లొత్తితే
సుద్దు లేమి యడిగేవు సొరిది నీవు
వొద్దిక నల పారఁగ నెయ్య నే విసరితే
కొద్దిమీఱఁ జెమటలు కురిసేవు నీవు
(॥ఏమయ్య॥)
యెత్తుగా బటువుబిల్ల లిరువంకలాఁ బెట్టితే
హత్తి చన్ను లంటె వప్పటి నీవు
బత్తితోఁ బచ్చడము నీపై నిండాఁ గప్పితే
మొత్తమి నేల నవ్వేవు ముసుఁగులో నీవు
(॥ఏమయ్య॥)
చేరి రంతు సేయకుండా చెలుల రానీకుండితే
ఆరయఁ గౌఁగిలించేవు అంతలో నీవు
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
కోరికె లింపొందెఁ దొల్లే కూడవద్దా నీవు
(||pallavi||)
emayyā nā seva lĕssa yīḍerĕnā
āmugŏnna nī talam̐pu lānadiyyavayyā
(||ema||)
niddiriṁchavalĕ naṁṭā nem̐ bādamu lŏttide
suddu lemi yaḍigevu sŏridi nīvu
vŏddiga nala pāram̐ga nĕyya ne visaride
kŏddimīṟam̐ jĕmaḍalu kurisevu nīvu
(||emayya||)
yĕttugā baḍuvubilla liruvaṁkalām̐ bĕṭṭide
hatti sannu laṁṭĕ vappaḍi nīvu
battidom̐ bachchaḍamu nībai niṁḍām̐ gappide
mŏttami nela navvevu musum̐gulo nīvu
(||emayya||)
seri raṁtu seyaguṁḍā sĕlula rānīguṁḍide
ārayam̐ gaum̐giliṁchevu aṁtalo nīvu
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
korigĕ liṁpŏṁdĕm̐ dŏlle kūḍavaddā nīvu