ఏమయ్యా నా మనసు నీ వెరఁగనిదా
(॥పల్లవి॥)
ఏమయ్యా నా మనసు నీ వెరఁగనిదా
కామించితి వలపులఁ గడమేమీ లేదు
(॥ఏమ॥)
మచ్చిక గలుగు సతి మాటలెన్ని యాడినాను
యిచ్చకమే కాని మరి యెగ్గు దోఁచదు
అచ్చముగాను సరస మాడితేను తనలోన
విచ్చనవిడముగాని వెగటు దోఁచదు
(॥ఏమ॥)
చుట్టిరికమైనవారు సొరిది నెంత చూచినా
దట్టపు వేడుకే కాని తప్పులెంచరు
ఱట్టడితనాలఁ దాను ఱాయివలె నుండినా
అట్టె మేనులుబ్బుఁ గాని అలయికగాదు
(॥ఏమ॥)
చనవుగలిగినాపె జంకించి కూడితేను
మనసు రంజిల్లుఁ గాని మరపుగాదు
యెనసితివి శ్రీ వేంకటేశ నన్ను నింతలోనే
యినుమడౌఁగాని తమి యిఁకఁ గొంకులేదు
(||pallavi||)
emayyā nā manasu nī vĕram̐ganidā
kāmiṁchidi valabulam̐ gaḍamemī ledu
(||ema||)
machchiga galugu sadi māḍalĕnni yāḍinānu
yichchagame kāni mari yĕggu dom̐sadu
achchamugānu sarasa māḍidenu tanalona
vichchanaviḍamugāni vĕgaḍu dom̐sadu
(||ema||)
suṭṭirigamainavāru sŏridi nĕṁta sūsinā
daṭṭabu veḍuge kāni tappulĕṁcharu
ṟaṭṭaḍidanālam̐ dānu ṟāyivalĕ nuṁḍinā
aṭṭĕ menulubbum̐ gāni alayigagādu
(||ema||)
sanavugaliginābĕ jaṁkiṁchi kūḍidenu
manasu raṁjillum̐ gāni marabugādu
yĕnasidivi śhrī veṁkaḍeśha nannu niṁtalone
yinumaḍaum̐gāni tami yim̐kam̐ gŏṁkuledu