Emayyaa naa gunamu yeṟamgavaa neevemainaa

ఏమయ్యా నా గుణము యెఱఁగవా నీవేమైనా
Language

(॥పల్లవి॥)
ఏమయ్యా నా గుణము యెఱఁగవా నీవేమైనా
గోమున నా సంగడినిఁ గూచుందువు రావయ్యా

(॥ఏమ॥)
వోడక నిన్నంతేసి వొరసేటిదాననా
వాడికలు చెప్పుకొని వచ్చేదాననా
యేడ నుండయినా నిన్ను నెలఇంచేదాననా
కూడుమని నిన్ను వేఁడుకొనేదానఁగాక

(॥ఏమ॥)
పంతమాడి నిన్ను నిట్టె బాస గొనేదాననా
చెంతఁ బెక్కుచీరలు దీసేటిదాననా
రంతుసేసి ని న్నింటికి రప్పించుకొనేదాననా
సంతోసాన మొక్కి సేస చల్లేదానఁగాక

(॥ఏమ॥)
బయలు వందిలి వెట్టి భ్రమయించేదాననా
క్రియ యెఱఁగక పలికేటిదాననా
నియతి శ్రీవేంకటేశ నీవు నన్ను నేలితివి
నయమున నిఁక నీతో నవ్వేదానఁగాక

(||pallavi||)
emayyā nā guṇamu yĕṟam̐gavā nīvemainā
gomuna nā saṁgaḍinim̐ gūsuṁduvu rāvayyā

(||ema||)
voḍaga ninnaṁtesi vŏraseḍidānanā
vāḍigalu sĕppugŏni vachchedānanā
yeḍa nuṁḍayinā ninnu nĕla̮iṁchedānanā
kūḍumani ninnu vem̐ḍugŏnedānam̐gāga

(||ema||)
paṁtamāḍi ninnu niṭṭĕ bāsa gŏnedānanā
sĕṁtam̐ bĕkkusīralu dīseḍidānanā
raṁtusesi ni nniṁṭigi rappiṁchugŏnedānanā
saṁtosāna mŏkki sesa salledānam̐gāga

(||ema||)
bayalu vaṁdili vĕṭṭi bhramayiṁchedānanā
kriya yĕṟam̐gaga paligeḍidānanā
niyadi śhrīveṁkaḍeśha nīvu nannu nelidivi
nayamuna nim̐ka nīdo navvedānam̐gāga