Emayyaa imtadilone yela lomgevu

ఏమయ్యా ఇంతటిలోనే యేల లోఁగేవు
Language

(॥పల్లవి॥)
ఏమయ్యా ఇంతటిలోనే యేల లోఁగేవు
ఆముకొన్న నీ వేడుక కడ్డగించేనా

(॥ఏమ॥)
చేరఁడేసి కన్నులాపె చెంగలించి చూడఁగాను
కూరిముతోఁ దలవంచుకొందురా నీవు
చేరి నన్నుఁ గని యేల సిగ్గువడే వింతలోన
తారుకాణ చేసి నీపైఁ దప్పు వేసేనా

(॥ఏమ॥)
వుంగరాల చేతులాకె వొడివట్టి తియ్యఁగాను
సంగతి గాదనుచు సన్న సే సేవు
చెంగట నే నుండఁగాను చెల్లఁబో యేల కొంకేవు
అంగడిఁబెట్టి వలపు లారడి చేసేనా

(॥ఏమ॥)
మొలకచన్నుల యాపె ముంచి కాఁగిలించుకోఁగా
చెలఁగి నాతో నేమి చెప్పవచ్చేవు
అలరి శ్రీ వేంకటేశ అట్టె నన్ను నేలితివి
నెలకొన్న పనులకు నిన్ను నవ్వేనా

(||pallavi||)
emayyā iṁtaḍilone yela lom̐gevu
āmugŏnna nī veḍuga kaḍḍagiṁchenā

(||ema||)
seram̐ḍesi kannulābĕ sĕṁgaliṁchi sūḍam̐gānu
kūrimudom̐ dalavaṁchugŏṁdurā nīvu
seri nannum̐ gani yela sigguvaḍe viṁtalona
tārugāṇa sesi nībaim̐ dappu vesenā

(||ema||)
vuṁgarāla sedulāgĕ vŏḍivaṭṭi tiyyam̐gānu
saṁgadi gādanusu sanna se sevu
sĕṁgaḍa ne nuṁḍam̐gānu sĕllam̐bo yela kŏṁkevu
aṁgaḍim̐bĕṭṭi valabu lāraḍi sesenā

(||ema||)
mŏlagasannula yābĕ muṁchi kām̐giliṁchugom̐gā
sĕlam̐gi nādo nemi sĕppavachchevu
alari śhrī veṁkaḍeśha aṭṭĕ nannu nelidivi
nĕlagŏnna panulagu ninnu navvenā