ఏమయ్యా ఆఁడుజన్మము యింత పలచనాయనా
(॥పల్లవి॥)
ఏమయ్యా ఆఁడుజన్మము యింత పలచనాయనా
నేమము దప్పనివాఁడే నెరజాణ మహిని
(॥ఏమ॥)
పొంది నీ కాఁగిటిలోనే పొలయలుకలు సేసి
కందువలంటనీవంటా కాఁక రేఁచేవు
మందలించి వనితల మనసు వచ్చినట్టే
పొంద నేరిచినవాఁడే పురుషుఁడు మహిని
(॥ఏమ॥)
వొయ్యనే నీకాఁగిటిలో పుపరిసురతానకు
ఇయ్యకొననై తినంటా నెగ్గు వట్టేవు
చయ్యన కామినుల చనవులే చెల్లించి
నెయ్యము సలిపేవాఁడే నెరజాణఁడిపుడు
(॥ఏమ॥)
సురతవేళను మేను చొక్కించి పేరఁ బిలిచి
యెరవై వుందాననంటానేల నవ్వేవు
సిరుల శ్రీవేంకటేశ సేసవెట్టి పెండ్లాడితి-
వరుదు నీవంటివాఁడు అరసి చూడఁగను
(||pallavi||)
emayyā ām̐ḍujanmamu yiṁta palasanāyanā
nemamu dappanivām̐ḍe nĕrajāṇa mahini
(||ema||)
pŏṁdi nī kām̐giḍilone pŏlayalugalu sesi
kaṁduvalaṁṭanīvaṁṭā kām̐ka rem̐sevu
maṁdaliṁchi vanidala manasu vachchinaṭṭe
pŏṁda nerisinavām̐ḍe puruṣhum̐ḍu mahini
(||ema||)
vŏyyane nīgām̐giḍilo pubarisuradānagu
iyyagŏnanai tinaṁṭā nĕggu vaṭṭevu
sayyana kāminula sanavule sĕlliṁchi
nĕyyamu salibevām̐ḍe nĕrajāṇam̐ḍibuḍu
(||ema||)
suradaveḽanu menu sŏkkiṁchi peram̐ bilisi
yĕravai vuṁdānanaṁṭānela navvevu
sirula śhrīveṁkaḍeśha sesavĕṭṭi pĕṁḍlāḍidi-
varudu nīvaṁṭivām̐ḍu arasi sūḍam̐ganu