(॥పల్లవి॥)
ఏమయ్య యింతయేల యెకసక్కేలు
సాముసేసిన నీతో సతి పెనఁగీనా
(॥॥)
పలచనినగవులపగిడికాఁడవు
వెలలేనివేడుకల వేసదారివి
మలకలపలుకులమతకరివాఁడవు
కలికి నీకు నేడు కత చెప్పఁ గలదా
(॥॥)
తిరువు మురువు నే నేదిమ్మరీఁడవు
పరుగు పెక్కువిద్యలబయకాఁడవు
అరుదై నజూదాల ఆగడీఁడవు
గరిమ నీకు నింతి కత చెప్ప గలదా
(॥॥)
సంతకూటముల జాణకా డవు
మంతనపురతుల మాసటీఁడవు
చెంతఁ గలసితివి శ్రీ వేంకటేశ్వర
కాంత నీకు నిట్టె కత చెప్ప గలదా
(||pallavi||)
emayya yiṁtayela yĕgasakkelu
sāmusesina nīdo sadi pĕnam̐gīnā
(||||)
palasaninagavulabagiḍigām̐ḍavu
vĕlaleniveḍugala vesadārivi
malagalabalugulamadagarivām̐ḍavu
kaligi nīgu neḍu kada sĕppam̐ galadā
(||||)
tiruvu muruvu ne nedimmarīm̐ḍavu
parugu pĕkkuvidyalabayagām̐ḍavu
arudai najūdāla āgaḍīm̐ḍavu
garima nīgu niṁti kada sĕppa galadā
(||||)
saṁtagūḍamula jāṇagā ḍavu
maṁtanaburadula māsaḍīm̐ḍavu
sĕṁtam̐ galasidivi śhrī veṁkaḍeśhvara
kāṁta nīgu niṭṭĕ kada sĕppa galadā