ఏమయ్య యిందుకు నిన్నేమందును
(॥పల్లవి॥)
ఏమయ్య యిందుకు నిన్నేమందును
కామించవలదా కైకొని నీవిపుడు
(॥ఏమ॥)
గాలించి గాలించి కలికి మాటలాడఁగా
లాలించవలదా లలనఁ గొంత
పోలించి పోలించి పొగడఁగా నప్పటిని
పాలించవలదా పయికొని నీవిపుడు
(॥ఏమ॥)
సోదించి సోదించి సుద్దుల నిన్ను మెచ్చఁగా
ఆదరించఁగ వద్దా అన్నిటా నీవు
సాదించి సాదించి సరి నీతో నవ్వఁగా
మోదించవలదా మొదల నీవిపుడు
(॥ఏమ॥)
కరఁగించి కరఁగించి కాఁగిట నిన్నుఁ గూడఁగా
పొరయించవలదా పొందుల నేఁడు
సిరులుమించఁగ మించ శ్రీవెంకటేశుఁడుగూడె
యిరువుకోవలదా యిచ్చకములిపుడు
(||pallavi||)
emayya yiṁdugu ninnemaṁdunu
kāmiṁchavaladā kaigŏni nīvibuḍu
(||ema||)
gāliṁchi gāliṁchi kaligi māḍalāḍam̐gā
lāliṁchavaladā lalanam̐ gŏṁta
poliṁchi poliṁchi pŏgaḍam̐gā nappaḍini
pāliṁchavaladā payigŏni nīvibuḍu
(||ema||)
sodiṁchi sodiṁchi suddula ninnu mĕchcham̐gā
ādariṁcham̐ga vaddā anniḍā nīvu
sādiṁchi sādiṁchi sari nīdo navvam̐gā
modiṁchavaladā mŏdala nīvibuḍu
(||ema||)
karam̐giṁchi karam̐giṁchi kām̐giḍa ninnum̐ gūḍam̐gā
pŏrayiṁchavaladā pŏṁdula nem̐ḍu
sirulumiṁcham̐ga miṁcha śhrīvĕṁkaḍeśhum̐ḍugūḍĕ
yiruvugovaladā yichchagamulibuḍu