(॥పల్లవి॥)
ఏమయ్య తగవు నీవెఱఁగనిదా
కామించితే బిగిసే విక్కడి జాణతనమా
(॥ఏమ॥)
కోరికతో నిన్ను నాపె కొంగువట్టి తియ్యఁగాను
సారె సిగ్గులువడేది జాణతనమా
నేరుపుతో బత్తి గడు నీమీఁదఁ జేయఁగాను
యీరీతి గుట్టుసేసే విది జాణతనమా
(॥ఏమ॥)
గోమునఁ బెంచినయట్టిగుబ్బల నిన్నొత్తఁగాను
సాముసేసే నాపెతోను జాణతనమా
నేమముతోఁ గానుకిచ్చి నిన్నుఁ దప్పకచూడఁగా
ఆమనినవ్వులు నవ్వే వది జాణతనమా
(॥ఏమ॥)
కడలేనినిబ్బరాన కాఁగిట నిన్నుఁ గూడఁగా
జడిసేవు రతులకు జాణతనమా
అడరి శ్రీవేంకటేశ ఆపె నీకు మొక్కఁగాను
తొడరి కొసరే నింక దొమ్మి జాణతనమా
(||pallavi||)
emayya tagavu nīvĕṟam̐ganidā
kāmiṁchide bigise vikkaḍi jāṇadanamā
(||ema||)
korigado ninnu nābĕ kŏṁguvaṭṭi tiyyam̐gānu
sārĕ sigguluvaḍedi jāṇadanamā
nerubudo batti gaḍu nīmīm̐dam̐ jeyam̐gānu
yīrīdi guṭṭusese vidi jāṇadanamā
(||ema||)
gomunam̐ bĕṁchinayaṭṭigubbala ninnŏttam̐gānu
sāmusese nābĕdonu jāṇadanamā
nemamudom̐ gānugichchi ninnum̐ dappagasūḍam̐gā
āmaninavvulu navve vadi jāṇadanamā
(||ema||)
kaḍaleninibbarāna kām̐giḍa ninnum̐ gūḍam̐gā
jaḍisevu radulagu jāṇadanamā
aḍari śhrīveṁkaḍeśha ābĕ nīgu mŏkkam̐gānu
tŏḍari kŏsare niṁka dŏmmi jāṇadanamā