Emayya soosinavaaru imdarunu nagaraa

ఏమయ్య చూచినవారు ఇందరును నగరా
Language

(॥పల్లవి॥)
ఏమయ్య చూచినవారు ఇందరును నగరా
నీ మనసు గరఁగితే నిండుకుండ రాదా

(॥ఏమ॥)
చెప్పరాని విన్నపాలు సేసుకొంటి నల్లనాఁడె
అప్పటి నేమిటికాడే వా మాటలు
చిప్పిలుఁజెమటలతో చేతులెత్తి మొక్కితిని
ఇప్పుడేల చేయిచాఁచే వింకా నీవు

(॥ఏమ॥)
ఇవల నీసేవసేసి ఇన్నిటా మండాడుకొంటి
అవియేల తలఁచేవు ఆసుద్దులు
చివురుఁ జేతులను నీచెక్కు నొక్కి వేడుకొంటి
జవళి నేమిటికి నాసలఁబెట్టే విప్పుడు

(॥ఏమ॥)
ముట్టుకుమనుచు నీతమ్ములము నేఁ జవిగొంటి
అట్టే విడువరాదా ఆకతలు
నెట్టన శ్రీవేంకటేశ నేఁడు నన్నుఁ గూడితివి
చుట్టమ నయితి నెంత చొక్కులఁ బెట్టేవు

(||pallavi||)
emayya sūsinavāru iṁdarunu nagarā
nī manasu garam̐gide niṁḍuguṁḍa rādā

(||ema||)
sĕpparāni vinnabālu sesugŏṁṭi nallanām̐ḍĕ
appaḍi nemiḍigāḍe vā māḍalu
sippilum̐jĕmaḍalado sedulĕtti mŏkkidini
ippuḍela seyisām̐se viṁkā nīvu

(||ema||)
ivala nīsevasesi inniḍā maṁḍāḍugŏṁṭi
aviyela talam̐sevu āsuddulu
sivurum̐ jedulanu nīsĕkku nŏkki veḍugŏṁṭi
javaḽi nemiḍigi nāsalam̐bĕṭṭe vippuḍu

(||ema||)
muṭṭugumanusu nīdammulamu nem̐ javigŏṁṭi
aṭṭe viḍuvarādā āgadalu
nĕṭṭana śhrīveṁkaḍeśha nem̐ḍu nannum̐ gūḍidivi
suṭṭama nayidi nĕṁta sŏkkulam̐ bĕṭṭevu