ఏమయ్య చిత్తగించ వింకా నీవు
(॥పల్లవి॥)
ఏమయ్య చిత్తగించ వింకా నీవు
దామెన కాఁకలు నీపైఁ దగిలించీ నిదివో
(॥ఏమ॥)
మలయు మదిలోఁ గొంత మాటలలోపలఁ గొంత
చెలి నీపై గుమ్మరించీఁ జేరి చేరి
అలిగినదియుఁ గాదు అట్టె కూడినదీఁ గాదు
తలుపుమాటున నుండి తడఁబడీ నదివో
(॥ఏమ॥)
ముంచి విరహపుతేట మొక్కలపుఁ గన్నీట
యించుకించుకే చిమ్మీ నింత నీమీఁద
మంచము మీఁదికి రాదు మరఁగుకైనాఁబోదు
అంచెల మొకమెదుట నానుకున్న దదివో
(॥ఏమ॥)
జవ్వనములోనిపచ్చి చనవులనే కొచ్చి
రవ్వగా నీ కొప్పగించీ రమణి నేఁడు
యివ్వల శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
కువ్వనిపేరై నీకు గురుతాయి నదివో
(||pallavi||)
emayya sittagiṁcha viṁkā nīvu
dāmĕna kām̐kalu nībaim̐ dagiliṁchī nidivo
(||ema||)
malayu madilom̐ gŏṁta māḍalalobalam̐ gŏṁta
sĕli nībai gummariṁchīm̐ jeri seri
aliginadiyum̐ gādu aṭṭĕ kūḍinadīm̐ gādu
talubumāḍuna nuṁḍi taḍam̐baḍī nadivo
(||ema||)
muṁchi virahabudeḍa mŏkkalabum̐ gannīḍa
yiṁchugiṁchuge simmī niṁta nīmīm̐da
maṁchamu mīm̐digi rādu maram̐gugainām̐bodu
aṁchĕla mŏgamĕduḍa nānugunna dadivo
(||ema||)
javvanamulonibachchi sanavulane kŏchchi
ravvagā nī kŏppagiṁchī ramaṇi nem̐ḍu
yivvala śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
kuvvaniberai nīgu gurudāyi nadivo