ఏమయ్య రమణుఁడ యింత సేతురటవయ్యా
(॥పల్లవి॥)
ఏమయ్య రమణుఁడ యింత సేతురటవయ్యా
కామిని నూరడించి కలయఁగరాదా
(॥ఏమ॥)
పడఁతి కధరమిచ్చి పలుసోఁకించినది
బడి బడి విందువెట్ట పగలాయ
వెడవెడఁగా నవ్వి వెంగెమాడినది
తొడికేదోమటి పాలఁదోడనే వేఁడాయ
(॥ఏమ॥)
తరుణిఁ దప్పకచూచి తలవంచినది
అరిది నమ్మించి తప్పినట్లాయ
సరస మాడియాడి సరుగన దాఁగినది
పొరిఁబొరి మధ్యాహ్నానఁ బొద్దుగుంకినట్టాయ
(॥ఏమ॥)
మెలుఁత గాఁగిటఁ గూడి మేను మరచినది
నిలువునీడలలోన నివ్వెరగాయ
అలరి శ్రీవేంకటేశ ఆదరించినది
ఫలియించి పసిఁడిలోఁ బరిమళమాయ
(||pallavi||)
emayya ramaṇum̐ḍa yiṁta seduraḍavayyā
kāmini nūraḍiṁchi kalayam̐garādā
(||ema||)
paḍam̐ti kadharamichchi palusom̐kiṁchinadi
baḍi baḍi viṁduvĕṭṭa pagalāya
vĕḍavĕḍam̐gā navvi vĕṁgĕmāḍinadi
tŏḍigedomaḍi pālam̐doḍane vem̐ḍāya
(||ema||)
taruṇim̐ dappagasūsi talavaṁchinadi
aridi nammiṁchi tappinaṭlāya
sarasa māḍiyāḍi sarugana dām̐ginadi
pŏrim̐bŏri madhyāhnānam̐ bŏdduguṁkinaṭṭāya
(||ema||)
mĕlum̐ta gām̐giḍam̐ gūḍi menu marasinadi
niluvunīḍalalona nivvĕragāya
alari śhrīveṁkaḍeśha ādariṁchinadi
phaliyiṁchi pasim̐ḍilom̐ barimaḽamāya