(॥పల్లవి॥)
ఏమయ్య రమణుఁడ యెంత సేసేవూ
భామ నిన్నుఁ దలపోసీఁ బైకొనుదాఁకాను
(॥ఏ మయ్య॥)
చింతలచిగురు గోసీఁ జిత్తములోనఁ
గాంతుఁడ ని న్నెదుటనుఁ గన్నదాఁకాను
పొంతఁ బ్రియములఁ జేసీ బోనాలు
సంతతపు వలపుల చవి గొనుదాఁకాను
(॥ఏ మయ్య॥)
వెదచల్లీఁ జీఁకటులు వేనలివెంట
అదె నీవిరహతాప మాఁపఁగ లేక
తుదుచూపులనె కట్టె దోరణాలు
వదలక నీ వింటికి వచ్చినదాఁకానూ
(॥ఏమయ్య॥)
ముగ్గులు వెట్టీఁ జెమటుమత్తెములను
అగ్గ మై నీవు తనుఁ బెం డ్లాడుదాఁకాను
సిగ్గుదేరఁ గూడితివి శ్రీవెంకటేశ
అగ్గల మై నీకు మొక్కె నట్టె యిందాఁకానూ
(||pallavi||)
emayya ramaṇum̐ḍa yĕṁta sesevū
bhāma ninnum̐ dalabosīm̐ baigŏnudām̐kānu
(||e mayya||)
siṁtalasiguru gosīm̐ jittamulonam̐
gāṁtum̐ḍa ni nnĕduḍanum̐ gannadām̐kānu
pŏṁtam̐ briyamulam̐ jesī bonālu
saṁtadabu valabula savi gŏnudām̐kānu
(||e mayya||)
vĕdasallīm̐ jīm̐kaḍulu venalivĕṁṭa
adĕ nīvirahadāba mām̐pam̐ga lega
tudusūbulanĕ kaṭṭĕ doraṇālu
vadalaga nī viṁṭigi vachchinadām̐kānū
(||emayya||)
muggulu vĕṭṭīm̐ jĕmaḍumattĕmulanu
agga mai nīvu tanum̐ bĕṁ ḍlāḍudām̐kānu
sigguderam̐ gūḍidivi śhrīvĕṁkaḍeśha
aggala mai nīgu mŏkkĕ naṭṭĕ yiṁdām̐kānū