ఏమయ్య నీవు దొల్లి యెఱఁగని తగవా
(॥పల్లవి॥)
ఏమయ్య నీవు దొల్లి యెఱఁగని తగవా
చే ముంచి మావిన్నపము చిత్తగింతువు గాక
(॥॥)
నమ్మినట్టివారిని నగుఁ బాటు సేతురా
నెమ్మది నందరిలో మన్నింతురు గాక
సమ్మతించి వుండఁ గాను జరుపేవా వినోదాలు
యిమ్ముల లాలించి కీర్తి కెక్కింతువు గాక
(॥॥)
మరిగి కొల్చినవారి మంకులఁ జేయుదురా
పొరి మంచిగుణాలు నేర్పుదురు గాక
సరివలచినవారిఁ జలము సాదింతురా
పరగ లోలో నొడఁ బరతురు గాక
(॥॥)
కైవసమయినవారిఁ గాకుసేయఁ జెల్లునా
నీవే యెరిఁగి కరుణింతువు గాక
యీవేళ శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
దేవులై నీకు మొక్కు దీవింతురు గాక
(||pallavi||)
emayya nīvu dŏlli yĕṟam̐gani tagavā
se muṁchi māvinnabamu sittagiṁtuvu gāga
(||||)
namminaṭṭivārini nagum̐ bāḍu sedurā
nĕmmadi naṁdarilo manniṁturu gāga
sammadiṁchi vuṁḍam̐ gānu jarubevā vinodālu
yimmula lāliṁchi kīrdi kĕkkiṁtuvu gāga
(||||)
marigi kŏlsinavāri maṁkulam̐ jeyudurā
pŏri maṁchiguṇālu nerbuduru gāga
sarivalasinavārim̐ jalamu sādiṁturā
paraga lolo nŏḍam̐ baraduru gāga
(||||)
kaivasamayinavārim̐ gāguseyam̐ jĕllunā
nīve yĕrim̐gi karuṇiṁtuvu gāga
yīveḽa śhrī veṁkaḍeśha yīgĕ yalamelumaṁga
devulai nīgu mŏkku dīviṁturu gāga