Emayya neeveṟamgavaa yelaa imta seyimchevu

ఏమయ్య నీవెఱఁగవా యేలా ఇంత సేయించేవు
Language

(॥పల్లవి॥)
ఏమయ్య నీవెఱఁగవా యేలా ఇంత సేయించేవు
దామెన జగడాలకు తానా యెదురు

(॥ఏమ॥)
సలిగెలు పట్టుకొని సతి మాటలాడీఁగాక
తలఁకక నే నాడితే తానా యెదురు
నెలవై దిట్టతనమునేరుచుక వచ్చెఁగాక
తలమని జంకించితేతానా యెదురు

(॥ఏమ॥)
తోడునెట్టుకొని చెలి తుటారించవచ్చీఁగాక
దాడిగా నేదికొంటేతానాయెదురు
యేడో కన్నుసన్నలకు యెమ్మలు సేసీఁగాక
తాడుపడక పైకొంటే తానా ఎదురు

(॥ఏమ॥)
చెప్పుడుబుద్దులకును చేయెత్తి మొక్కీఁగాక
తప్పులు నేఁబట్టేనంటే తానా యెదురు
అప్పఁడ శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
దప్పిదేరఁ గూడితివి తానా యెదురు

(||pallavi||)
emayya nīvĕṟam̐gavā yelā iṁta seyiṁchevu
dāmĕna jagaḍālagu tānā yĕduru

(||ema||)
saligĕlu paṭṭugŏni sadi māḍalāḍīm̐gāga
talam̐kaga ne nāḍide tānā yĕduru
nĕlavai diṭṭadanamunerusuga vachchĕm̐gāga
talamani jaṁkiṁchidedānā yĕduru

(||ema||)
toḍunĕṭṭugŏni sĕli tuḍāriṁchavachchīm̐gāga
dāḍigā nedigŏṁṭedānāyĕduru
yeḍo kannusannalagu yĕmmalu sesīm̐gāga
tāḍubaḍaga paigŏṁṭe tānā ĕduru

(||ema||)
sĕppuḍubuddulagunu seyĕtti mŏkkīm̐gāga
tappulu nem̐baṭṭenaṁṭe tānā yĕduru
appam̐ḍa śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
dappideram̐ gūḍidivi tānā yĕduru