Emayya nee doradana miduvamtidaa

ఏమయ్య నీ దొరతన మిటువంటిదా
Language

(॥పల్లవి॥)
ఏమయ్య నీ దొరతన మిటువంటిదా
నీ మనసు నాపై బత్తి నే నెరఁగనా

(॥ఏమయ్య॥)
ఆపె నిన్ను వెడమాట లాడఁగాను విని నీవు
యేపున నూరకుండితి వేమయ్య
నీ పొందు లిటువంటివా నిన్నిందరుఁ గనరా
వో పో నమ్నినదాని నొప్పగింతురా

(॥ఏమయ్య॥)
వోరతోడ నాపె సేసే వుద్దండా లెల్లాఁ జూచి
బీరాన నీవు వచ్చి పెనఁగ వద్దా
నేరపు లేనివాఁడవా నీ వెరఁగవా యిన్ని
కోరి నీవే గతి యంటే కూడుక రావలదా

(॥ఏమయ్య॥)
పొంచి యాపె చేసేసుక పోఁగా నేఁ డా గర్వ మెల్ల
తుంచి వేయకుంటె నది దోసము గాదా
మించి శ్రీవెంటేశుఁడ మే లిచ్చి నన్నుఁ గూడితి
తెంచి నా పగ లన్నియుఁ దీరిచితి విపుడు

(||pallavi||)
emayya nī dŏradana miḍuvaṁṭidā
nī manasu nābai batti ne nĕram̐ganā

(||emayya||)
ābĕ ninnu vĕḍamāḍa lāḍam̐gānu vini nīvu
yebuna nūraguṁḍidi vemayya
nī pŏṁdu liḍuvaṁṭivā ninniṁdarum̐ ganarā
vo po namninadāni nŏppagiṁturā

(||emayya||)
voradoḍa nābĕ sese vuddaṁḍā lĕllām̐ jūsi
bīrāna nīvu vachchi pĕnam̐ga vaddā
nerabu lenivām̐ḍavā nī vĕram̐gavā yinni
kori nīve gadi yaṁṭe kūḍuga rāvaladā

(||emayya||)
pŏṁchi yābĕ sesesuga pom̐gā nem̐ ḍā garva mĕlla
tuṁchi veyaguṁṭĕ nadi dosamu gādā
miṁchi śhrīvĕṁṭeśhum̐ḍa me lichchi nannum̐ gūḍidi
tĕṁchi nā paga lanniyum̐ dīrisidi vibuḍu