ఏమయ్య నన్నేల యెలయించేవు నీవు
(॥పల్లవి॥)
ఏమయ్య నన్నేల యెలయించేవు నీవు
చే ముంచి నీపాదాల సేవ సేసేదానను
(॥ఏమ॥)
వంతుకు నందరివలె వలచినదాననా
కాంతుఁడ నీవు మన్నించేకాంతను నేను
దొంతివావులు చెప్పేటిదోమటిలో దాననా
మంతనాన నెలకొన్న మచ్చికలోదానను
(॥ఏమ॥)
పూసుకవాసుకవచ్చే పొరుగులదాననా
రాసికెక్కే పట్టపురమణి నేను
వేసాలకుఁ గోసరేటివింతపొదులదాననా
సేసవెట్టి పెండ్లాడినచేతిలోని దానను
(॥ఏమ॥)
ముంచి కూడపెట్టుకొన్న మూఁకలోనిదాననా
కంచపుఁబాలకూళ్ళ కామిని నేను
యెంచఁగ శ్రీవేంకటేశ యేలితి వేడోదాననా
మించిననీవురముపై మేనదాననేను
(||pallavi||)
emayya nannela yĕlayiṁchevu nīvu
se muṁchi nībādāla seva sesedānanu
(||ema||)
vaṁtugu naṁdarivalĕ valasinadānanā
kāṁtum̐ḍa nīvu manniṁchegāṁtanu nenu
dŏṁtivāvulu sĕppeḍidomaḍilo dānanā
maṁtanāna nĕlagŏnna machchigalodānanu
(||ema||)
pūsugavāsugavachche pŏruguladānanā
rāsigĕkke paṭṭaburamaṇi nenu
vesālagum̐ gosareḍiviṁtabŏduladānanā
sesavĕṭṭi pĕṁḍlāḍinasediloni dānanu
(||ema||)
muṁchi kūḍabĕṭṭugŏnna mūm̐kalonidānanā
kaṁchabum̐bālagūḽḽa kāmini nenu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yelidi veḍodānanā
miṁchinanīvuramubai menadānanenu