(॥పల్లవి॥)
ఏమయ్య కటకటా యెంత దోసము
ఏమైన మందెమేళ మింత సేసీనా
(॥ఏమ॥)
ఆపె నీకు విడెమిచ్చేననఁగానే వేగిరించి
చాపలానఁ దముల మొసఁగుమనేవు
ఆపని తొల్లెలవాటైతే నీకు నాయఁగాక
యీపడఁతి యిపుడు నీ కెంగిలివెట్టీనా
(॥ఏమ॥)
వెలఁది నీకొకనాఁడు విందువెట్టేననఁగానె
తొలఁగక యిపుడే పొత్తుకు వచ్చేవు
అలరి నీకిది సాజమైతే నాయఁగాక
కలికి నీకు నెంగిలికడి వెట్టీనా
(॥ఏమ॥)
సారెకు రతుల మేలు చవిచూపేననఁగానె
తేరి యిందరిలో మోవితేనడిగేవు
మారుక శ్రీవేంకటాద్రిమండెమురాయ కూడితి
యీరీతి నింకా నీకు నెంగిలివెట్టీనా
(||pallavi||)
emayya kaḍagaḍā yĕṁta dosamu
emaina maṁdĕmeḽa miṁta sesīnā
(||ema||)
ābĕ nīgu viḍĕmichchenanam̐gāne vegiriṁchi
sābalānam̐ damula mŏsam̐gumanevu
ābani tŏllĕlavāḍaide nīgu nāyam̐gāga
yībaḍam̐ti yibuḍu nī kĕṁgilivĕṭṭīnā
(||ema||)
vĕlam̐di nīgŏganām̐ḍu viṁduvĕṭṭenanam̐gānĕ
tŏlam̐gaga yibuḍe pŏttugu vachchevu
alari nīgidi sājamaide nāyam̐gāga
kaligi nīgu nĕṁgiligaḍi vĕṭṭīnā
(||ema||)
sārĕgu radula melu savisūbenanam̐gānĕ
teri yiṁdarilo movidenaḍigevu
māruga śhrīveṁkaḍādrimaṁḍĕmurāya kūḍidi
yīrīdi niṁkā nīgu nĕṁgilivĕṭṭīnā