Emayya javaraali nemta sesevu

ఏమయ్య జవరాలి నెంత సేసేవు
Language

(॥పల్లవి॥)
ఏమయ్య జవరాలి నెంత సేసేవు
గోమునఁ బెరిగినట్టి కోమలి గాదా

(॥ఏమ॥)
చెలికిఁ బయ్యద జారె చెక్కు లెల్లాఁ జెమరించె
నలువంక నీ వింతేసి నవ్వించఁగాను
వెలయఁ దురిమినట్టివిరులు జల్లనరావే
నెలకొనఁ గడు నీవు నెత్త మాడించఁగను

(॥ఏమ॥)
కుచ్చల నెరి విరిగె గుదిగొనె నిట్టూర్పులు
ముచ్చటతో నాపెచేత మొక్కించుకోఁగా
కోచ్చి చెవిలో జవ్వాది కొణికెలవెంటఁ గారె
కచ్చు పెట్టి వలపులఁ గరఁగించఁగాను

(॥ఏమ॥)
కెరలెఁ బులకలెల్లా కెమ్మోవి వసివాడె
అరిమురి నీవు మాటలాడించఁగా
నెరయ శ్రీవేంకటేశ నినుఁ గూడి వెరగందె
మరియు రతులనెల్లా మన్నించఁగాను

(||pallavi||)
emayya javarāli nĕṁta sesevu
gomunam̐ bĕriginaṭṭi komali gādā

(||ema||)
sĕligim̐ bayyada jārĕ sĕkku lĕllām̐ jĕmariṁchĕ
naluvaṁka nī viṁtesi navviṁcham̐gānu
vĕlayam̐ duriminaṭṭivirulu jallanarāve
nĕlagŏnam̐ gaḍu nīvu nĕtta māḍiṁcham̐ganu

(||ema||)
kuchchala nĕri virigĕ gudigŏnĕ niṭṭūrbulu
muchchaḍado nābĕseda mŏkkiṁchugom̐gā
kochchi sĕvilo javvādi kŏṇigĕlavĕṁṭam̐ gārĕ
kachchu pĕṭṭi valabulam̐ garam̐giṁcham̐gānu

(||ema||)
kĕralĕm̐ bulagalĕllā kĕmmovi vasivāḍĕ
arimuri nīvu māḍalāḍiṁcham̐gā
nĕraya śhrīveṁkaḍeśha ninum̐ gūḍi vĕragaṁdĕ
mariyu radulanĕllā manniṁcham̐gānu