ఏమయా రావయా యెదురుచూచీఁ జెలియ
(॥పల్లవి॥)
ఏమయా రావయా యెదురుచూచీఁ జెలియ
భామలము నిన్ను నొడఁబరచఁగఁ గలమా
(॥ఏమ॥)
సొలతురా యిల్లాండ్లు సొరిది రమణునిఁ జేర
బిలుతురా రమ్మనుచుఁ బ్రియుని రతికి
తలఁతురా యిటువంటి తగవు నీ వేమైనాఁ
గలఁతురా సతిమనసు కరుణింతు గాక
(॥ఏమ॥)
ఆసలా సారె నిను నదరి తప్పక చూడ
వాసులా నీతోడ వడిఁ బెనఁగను
రాసు లాయను వలపు రమణి కొనఁగినతొంటి
బాన లాలించి యిటు పైకొందు గాక
(॥ఏమ॥)
కలసెనా కౌఁగిటను కదిసి యలమేల్మంగ
వెలసెనా నగవు శ్రీవేంకటేశ
తెలిసెనా మా మాట తేటపడ నింకాను
వలసెనా యీకెకై వస మౌదు గాకా
(||pallavi||)
emayā rāvayā yĕdurusūsīm̐ jĕliya
bhāmalamu ninnu nŏḍam̐barasam̐gam̐ galamā
(||ema||)
sŏladurā yillāṁḍlu sŏridi ramaṇunim̐ jera
biludurā rammanusum̐ briyuni radigi
talam̐turā yiḍuvaṁṭi tagavu nī vemainām̐
galam̐turā sadimanasu karuṇiṁtu gāga
(||ema||)
āsalā sārĕ ninu nadari tappaga sūḍa
vāsulā nīdoḍa vaḍim̐ bĕnam̐ganu
rāsu lāyanu valabu ramaṇi kŏnam̐ginadŏṁṭi
bāna lāliṁchi yiḍu paigŏṁdu gāga
(||ema||)
kalasĕnā kaum̐giḍanu kadisi yalamelmaṁga
vĕlasĕnā nagavu śhrīveṁkaḍeśha
tĕlisĕnā mā māḍa teḍabaḍa niṁkānu
valasĕnā yīgĕgai vasa maudu gāgā