Emaya needodibomdu liduvamtivi

ఏమయ నీతోడిపొందు లిటువంటివి
Language

(॥పల్లవి॥)
ఏమయ నీతోడిపొందు లిటువంటివి
దోమటి దొడికితేను తొడిఁబడ నెట్లో

(॥ఏమ॥)
నవ్వఁగానే నీతోను నాటుకొనెఁ బ్రియములు
దవ్వులనుండి చూచితేఁ దగిలె మతి
మువ్వంకల మొక్కఁగానే ముదిరె మిక్కిలియాస
యివ్వలఁ జేయంటితేను యిఁక నెంతేశౌనో

(॥ఏమ॥)
మాట లూరవే యాడితే మర్మములు గడురేఁగె
పాటించి కానుకియ్యఁగా పట్టెను తమి
చాటువమొగమోటు నమ్మతులాయ నన్నియు
యీటు సరసాలాడితే నిఁక నెంతేశౌనో

(॥ఏమ॥)
యేకాంతము జరపఁగా నిట్టె మేను చెమరించె
దికొని పెనఁగంగాను తేరెఁ బనులు
చేకొనె నలమేల్మంగ శ్రీవేంకటేశ్వర నిన్ను
యీకడఁ గాఁగిలించెను ఇఁక నెంతేశౌనో

(||pallavi||)
emaya nīdoḍibŏṁdu liḍuvaṁṭivi
domaḍi dŏḍigidenu tŏḍim̐baḍa nĕṭlo

(||ema||)
navvam̐gāne nīdonu nāḍugŏnĕm̐ briyamulu
davvulanuṁḍi sūsidem̐ dagilĕ madi
muvvaṁkala mŏkkam̐gāne mudirĕ mikkiliyāsa
yivvalam̐ jeyaṁṭidenu yim̐ka nĕṁteśhauno

(||ema||)
māḍa lūrave yāḍide marmamulu gaḍurem̐gĕ
pāḍiṁchi kānugiyyam̐gā paṭṭĕnu tami
sāḍuvamŏgamoḍu nammadulāya nanniyu
yīḍu sarasālāḍide nim̐ka nĕṁteśhauno

(||ema||)
yegāṁtamu jarabam̐gā niṭṭĕ menu sĕmariṁchĕ
digŏni pĕnam̐gaṁgānu terĕm̐ banulu
segŏnĕ nalamelmaṁga śhrīveṁkaḍeśhvara ninnu
yīgaḍam̐ gām̐giliṁchĕnu im̐ka nĕṁteśhauno