Emaribaadaaye nimka nemi seseve

ఏమరిపాటాయె నింక నేమి సేసేవే
Language

(॥పల్లవి॥)
ఏమరిపాటాయె నింక నేమి సేసేవే
ఆమని నీ కుచగిరు లడ్డ మయ్యీనా

(॥ఏమరి॥)
కొమ్మ నీవు జవ్వనివి కొంకక వొంటి నున్నదాన
విమ్ములనేఁ జెనకితే నేమి సేసేవే
చిమ్ముల మరునిచేఁతే చెల్లెఁ గాక యీవేళ
పమ్ము జూపు నీపంతాలు పై వచ్చీనా

(॥ఏమరి॥)
దిట్టవై వనములోనఁ దిరిగే వేపొద్దె నా
యిట్టెనేఁ జేయి వట్టితే నేమి సేసేవే
నెట్టినఁ గోరిక లెల్ల నెరవేరెఁ గాక నీ
దట్టపు బొమ్మల జంకె తప్పు గొనినా

(॥ఏమరి॥)
యేకతాన శ్రీవేంకటేశుఁడ నేఁ బానుపుపై
యీకడ నిన్నుఁ గూడితే నేమి సేసేవె
దాకొని నీచిత్త మెల్ల దక్కఁగొంటేఁ గొంటిఁ గాక
లాకల నీ పెనపులు లగ్గ పెట్టీనా

(||pallavi||)
emaribāḍāyĕ niṁka nemi seseve
āmani nī kusagiru laḍḍa mayyīnā

(||emari||)
kŏmma nīvu javvanivi kŏṁkaga vŏṁṭi nunnadāna
vimmulanem̐ jĕnagide nemi seseve
simmula marunisem̐te sĕllĕm̐ gāga yīveḽa
pammu jūbu nībaṁtālu pai vachchīnā

(||emari||)
diṭṭavai vanamulonam̐ dirige vebŏddĕ nā
yiṭṭĕnem̐ jeyi vaṭṭide nemi seseve
nĕṭṭinam̐ goriga lĕlla nĕraverĕm̐ gāga nī
daṭṭabu bŏmmala jaṁkĕ tappu gŏninā

(||emari||)
yegadāna śhrīveṁkaḍeśhum̐ḍa nem̐ bānububai
yīgaḍa ninnum̐ gūḍide nemi sesevĕ
dāgŏni nīsitta mĕlla dakkam̐gŏṁṭem̐ gŏṁṭim̐ gāga
lāgala nī pĕnabulu lagga pĕṭṭīnā