Emaṟam janadu bradigedi kaalamu yeṟimgina mahaatmulagunu

ఏమఱఁ జనదు బ్రదికేటి కాలము యెఱిఁగిన మహాత్ములకును
Language

(॥పల్లవి॥)
ఏమఱఁ జనదు బ్రదికేటి కాలము యెఱిఁగిన మహాత్ములకును
శ్రీమంతుఁడగు హరినే తలఁచిన చీఁకటు లన్నియుఁ బెడఁబాయు

(॥ఏమ॥)
చేరి వుండెడిది బ్రహ్మలోకమటశ్వేతుఁ డను రాజట భువిమీఁదకి
కారణమున నేతెంచి నిత్యమును కళేబరంబట తన కాహారము
ఆరయ సంపదలే పనికివచ్చునట లో కాంతరగతి నే మున్నది
శ్రీరమణునికే శరణు చొచ్చినను చెడనిభోగములు చేచేతఁ గలుగు

(॥ఏమ॥)
చేసన క్రతువులు నూఱట నహుషుడు చెలఁగుచు దేవేంద్రపట్ట మేలె నట
దోస మించుకంతకుఁగా భువిపైఁ దలుచుఁ బామై పడియె నటా
ఆసలఁ గర్మము నెట్టు నమ్మెడిది అమరత్వము ఫలమది యెట్లెంచుట
వాసుదేవునిఁ గొలిచి తా నతనివాఁడై యుండిననెలకొను శుభము

(॥ఏమ॥)
వెలయఁగ త్రిశంకు డనియెడి రాజట విశ్వామిత్రుని పరిగ్రహం బట
అలరిన చండాలత్వ మొందె నట యంతరిక్షమున నుండెనటా
బలుములు యెందాఁక వెంటవచ్చును పాయంబులుమఱి చెప్పఁగనేలా
యిలధరుఁడగు శ్రీవేంకటేశ్వరుని నెఱిఁగి దాసుఁడగుటే సత్ఫలము

(||pallavi||)
emaṟam̐ janadu bradigeḍi kālamu yĕṟim̐gina mahātmulagunu
śhrīmaṁtum̐ḍagu harine talam̐sina sīm̐kaḍu lanniyum̐ bĕḍam̐bāyu

(||ema||)
seri vuṁḍĕḍidi brahmalogamaḍaśhvedum̐ ḍanu rājaḍa bhuvimīm̐dagi
kāraṇamuna nedĕṁchi nityamunu kaḽebaraṁbaḍa tana kāhāramu
āraya saṁpadale panigivachchunaḍa lo kāṁtaragadi ne munnadi
śhrīramaṇunige śharaṇu sŏchchinanu sĕḍanibhogamulu sesedam̐ galugu

(||ema||)
sesana kraduvulu nūṟaḍa nahuṣhuḍu sĕlam̐gusu deveṁdrabaṭṭa melĕ naḍa
dosa miṁchugaṁtagum̐gā bhuvibaim̐ dalusum̐ bāmai paḍiyĕ naḍā
āsalam̐ garmamu nĕṭṭu nammĕḍidi amaratvamu phalamadi yĕṭlĕṁchuḍa
vāsudevunim̐ gŏlisi tā nadanivām̐ḍai yuṁḍinanĕlagŏnu śhubhamu

(||ema||)
vĕlayam̐ga triśhaṁku ḍaniyĕḍi rājaḍa viśhvāmitruni parigrahaṁ baḍa
alarina saṁḍālatva mŏṁdĕ naḍa yaṁtarikṣhamuna nuṁḍĕnaḍā
balumulu yĕṁdām̐ka vĕṁṭavachchunu pāyaṁbulumaṟi sĕppam̐ganelā
yiladharum̐ḍagu śhrīveṁkaḍeśhvaruni nĕṟim̐gi dāsum̐ḍaguḍe satphalamu