(॥పల్లవి॥)
ఏమఱకు జీవుఁడా యే కాలమూ
నేమముతో నుండితేనే నిలుచును కాలము
(॥ఏమ॥)
కడఁగి జూజమాడితేఁ గడచీన కాలము
నడుమ వేఁటలాడితే నడచీని కాలము
జడియుచు నిద్రించితే జరడీని కాలము
నిడివి హరిఁ గొల్చితే నిండుకుండుఁ గాలము
(॥ఏమ॥)
సతులంసంగడి నున్న సమసీని కాలము
వెతలఁ బొరలినాను వెళ్ళీని కాలము
సతతము దొంగిలినా చనిపోయీఁ గాలము
వ్రతియై యుండితేను వసమౌను కాలము
(॥ఏమ॥)
పాలుమాని వుండినాను పరివోవుఁ గాలము
కూళగోష్టినుండినాను కొంచపడుఁ గాలము
మేలులో శ్రీవేంకటేశు మేటికతలు వినుచు
తాలిమితో నుండినాను దక్కియుండుఁ గాలము
(||pallavi||)
emaṟagu jīvum̐ḍā ye kālamū
nemamudo nuṁḍidene nilusunu kālamu
(||ema||)
kaḍam̐gi jūjamāḍidem̐ gaḍasīna kālamu
naḍuma vem̐ṭalāḍide naḍasīni kālamu
jaḍiyusu nidriṁchide jaraḍīni kālamu
niḍivi harim̐ gŏlside niṁḍuguṁḍum̐ gālamu
(||ema||)
sadulaṁsaṁgaḍi nunna samasīni kālamu
vĕdalam̐ bŏralinānu vĕḽḽīni kālamu
sadatamu dŏṁgilinā saniboyīm̐ gālamu
vradiyai yuṁḍidenu vasamaunu kālamu
(||ema||)
pālumāni vuṁḍinānu parivovum̐ gālamu
kūḽagoṣhṭinuṁḍinānu kŏṁchabaḍum̐ gālamu
melulo śhrīveṁkaḍeśhu meḍigadalu vinusu
tālimido nuṁḍinānu dakkiyuṁḍum̐ gālamu