Emanuno aadamdamtaa nela lomgeve

ఏమనునో ఆతఁడంటా నేల లోఁగేవే
Language

(॥పల్లవి॥)
ఏమనునో ఆతఁడంటా నేల లోఁగేవే
కామినుల కీచేఁతలు కలవేకదే

(॥ఏమ॥)
బలువుగాఁ బతితోడఁ బంతమాడరాదుగాక
చెలరేఁగి ప్రియములు చెప్పఁగరాదా
కొలువులోఁ గొచ్చికొచ్చి కొసరఁగరాదుగాక
నలిరేఁగి సెలువుల నవ్వనైనరాదా

(॥ఏమ॥)
మందెమేళమున మారుమలయఁగరాదుగాక
చెంది వూడిగములెల్లాఁ జేయఁగరాదా
చిందరవందరగాను జీర దియ్యరాదుగాక
కందువఁ జన్నులనొత్తి కళ రేఁచరాదా

(॥ఏమ॥)
చెలరేఁగి మంచమెక్కి సిగ్గువడరాదుగాక
పిలిచి సరసమాడి పెనఁగరాదా
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశ్వరు-
నెలయించరాదుగాక యిట్టె కూడరాదా

(||pallavi||)
emanuno ādam̐ḍaṁṭā nela lom̐geve
kāminula kīsem̐talu kalavegade

(||ema||)
baluvugām̐ badidoḍam̐ baṁtamāḍarādugāga
sĕlarem̐gi priyamulu sĕppam̐garādā
kŏluvulom̐ gŏchchigŏchchi kŏsaram̐garādugāga
nalirem̐gi sĕluvula navvanainarādā

(||ema||)
maṁdĕmeḽamuna mārumalayam̐garādugāga
sĕṁdi vūḍigamulĕllām̐ jeyam̐garādā
siṁdaravaṁdaragānu jīra diyyarādugāga
kaṁduvam̐ jannulanŏtti kaḽa rem̐sarādā

(||ema||)
sĕlarem̐gi maṁchamĕkki sigguvaḍarādugāga
pilisi sarasamāḍi pĕnam̐garādā
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhvaru-
nĕlayiṁcharādugāga yiṭṭĕ kūḍarādā