Emannaa vaadugu vachche vemta garvamu

ఏమన్నా వాదుకు వచ్చే వెంత గర్వము
Language

(॥పల్లవి॥)
ఏమన్నా వాదుకు వచ్చే వెంత గర్వము
ఆముకొని మలసేవు అది యేరా నీవు

(॥ఏమన్నా॥)
పోరచి నీవెందుకైనాఁ బోతేఁ బోదువు గాక
యేరా కాలు దొక్కేవు యెంత గర్వము
పేరుకొని తిట్టితే నాపెదవులు గదలితే
ఆరసి తప్పక చూచే వది యేరా నీవు

(॥ఏమన్నా॥)
చిట్టకపుచేఁత లెల్లాఁ జేసితేఁ జేతువు గాక
యిట్టే నాపై విరిగేవు యెంత గర్వము
పట్టి నిన్నుఁ దోసితి నాపైఁ బడఁగఁ జే యెత్తితి
అట్టే వొత్తుక వచ్చే వది యేరా నీవూ

(॥ఏమన్నా॥)
బలిమిఁ గౌఁగిట నన్నుఁ బట్టితేఁ బట్టుదువుగాక
యెలమి సెలవి నవ్వేఁ వెంత గర్వము
నిలిచి శ్రీవేంకటేశ నిన్ను నిటు గూడితి నేను
ఆలిసితేఁ బంతమాడే వది యేరా నీవూ

(||pallavi||)
emannā vādugu vachche vĕṁta garvamu
āmugŏni malasevu adi yerā nīvu

(||emannā||)
porasi nīvĕṁdugainām̐ bodem̐ boduvu gāga
yerā kālu dŏkkevu yĕṁta garvamu
perugŏni tiṭṭide nābĕdavulu gadalide
ārasi tappaga sūse vadi yerā nīvu

(||emannā||)
siṭṭagabusem̐ta lĕllām̐ jesidem̐ jeduvu gāga
yiṭṭe nābai virigevu yĕṁta garvamu
paṭṭi ninnum̐ dosidi nābaim̐ baḍam̐gam̐ je yĕttidi
aṭṭe vŏttuga vachche vadi yerā nīvū

(||emannā||)
balimim̐ gaum̐giḍa nannum̐ baṭṭidem̐ baṭṭuduvugāga
yĕlami sĕlavi navvem̐ vĕṁta garvamu
nilisi śhrīveṁkaḍeśha ninnu niḍu gūḍidi nenu
ālisidem̐ baṁtamāḍe vadi yerā nīvū