ఏమన్నా నననీవే యింతి నీ వాతనితోఁడ
(॥పల్లవి॥)
ఏమన్నా నననీవే యింతి నీ వాతనితోఁడ
వాములై న మేలుమీఁద వాదులు నేరకువే
(॥ఏమ॥)
చెంగలిచూపులు చూడనేర్చినదానవు
నింగి బొమ్మజంకెనలు నేరకువే
కుంగనిచిలుకపలుకులు నేర్చినదానవు
కంగి నిష్టూరాలాడ కమ్మర నేరకువే
(॥ఏమ॥)
ననలుగా సెలవుల నవ్వనేర్చినదానవు
నినుపుల కసరులు నేరకువే
అనిశ మాతనికళ లంటనేర్చినదానవు
పెనఁగి విభుని రట్టుపట్టికువే
(॥ఏమ॥)
యెలమి రతుల భ్రమయించనేర్చినదానవు
నిలుగునివ్వెరగులు నేరకువే
కులికి శ్రీవేంకటేశుఁ గూడనేర్చినదానవు
పలుమారు నెన్నఁటికిఁ బాయఁగనేరకువే
(||pallavi||)
emannā nananīve yiṁti nī vādanidom̐ḍa
vāmulai na melumīm̐da vādulu neraguve
(||ema||)
sĕṁgalisūbulu sūḍanersinadānavu
niṁgi bŏmmajaṁkĕnalu neraguve
kuṁganisilugabalugulu nersinadānavu
kaṁgi niṣhṭūrālāḍa kammara neraguve
(||ema||)
nanalugā sĕlavula navvanersinadānavu
ninubula kasarulu neraguve
aniśha mādanigaḽa laṁṭanersinadānavu
pĕnam̐gi vibhuni raṭṭubaṭṭiguve
(||ema||)
yĕlami radula bhramayiṁchanersinadānavu
nilugunivvĕragulu neraguve
kuligi śhrīveṁkaḍeśhum̐ gūḍanersinadānavu
palumāru nĕnnam̐ṭigim̐ bāyam̐ganeraguve