ఏమన్నా నంటివి గాని యెంచిచూచితే నేఁడు
(॥పల్లవి॥)
ఏమన్నా నంటివి గాని యెంచిచూచితే నేఁడు
కామించు నాయకునిపైఁ గల్లలేదే యిఁకను
(॥ఏమ॥)
ఆనలువెట్టుకోఁగానే ఆడెనంటా లేనిమాట
పూని యేల గడించేవే పురుషునిపై
రానికోపమున నింత రవ్వసేసితే నెఱఁగ
కానిమ్మన ఆతనిపై కల్లలేదే యెపుడు
(॥ఏమ॥)
సాదువలె నుండఁగాను సన్న సేసీనంటా నెందో
వేదలేల కట్టేవే విభుఁనిమీఁద
వాదులొకటి పైఁ బెట్టి వంకలొత్తితే నెఱఁగ
కాదన నాతనిమీఁద కల్లలేదే యిపుడు
(॥ఏమ॥)
కొంగుపట్టి కొసరఁగ కులికి తీసెనంటా
వింగళించేవేలే శ్రీవేంకటేశ్వరు
చెంగటఁ గూడినందుకు చెనకితే నే నెఱఁగ
కంగులేనియాతనిపై కల్లలేదే యిపుడు
(||pallavi||)
emannā naṁṭivi gāni yĕṁchisūside nem̐ḍu
kāmiṁchu nāyagunibaim̐ gallalede yim̐kanu
(||ema||)
ānaluvĕṭṭugom̐gāne āḍĕnaṁṭā lenimāḍa
pūni yela gaḍiṁcheve puruṣhunibai
rānigobamuna niṁta ravvaseside nĕṟam̐ga
kānimmana ādanibai kallalede yĕbuḍu
(||ema||)
sāduvalĕ nuṁḍam̐gānu sanna sesīnaṁṭā nĕṁdo
vedalela kaṭṭeve vibhum̐nimīm̐da
vādulŏgaḍi paim̐ bĕṭṭi vaṁkalŏttide nĕṟam̐ga
kādana nādanimīm̐da kallalede yibuḍu
(||ema||)
kŏṁgubaṭṭi kŏsaram̐ga kuligi tīsĕnaṁṭā
viṁgaḽiṁchevele śhrīveṁkaḍeśhvaru
sĕṁgaḍam̐ gūḍinaṁdugu sĕnagide ne nĕṟam̐ga
kaṁguleniyādanibai kallalede yibuḍu