Emannaa naagum bodu ichchagimcha neegum bodu

ఏమన్నా నాకుఁ బోదు ఇచ్చగించ నీకుఁ బోదు
Language

(॥పల్లవి॥)
ఏమన్నా నాకుఁ బోదు ఇచ్చగించ నీకుఁ బోదు
మోము చూచినంతలోనె మొక్కనేఁటికయ్యా

(॥ఏమ॥)
పాయమె నాకు నెక్కె పంతమె నీకు నెక్కె
చేయార యేమైనాఁ జేయవయ్య
కాయము నాకే సెలవు కాఁకలు నీకే సెలవు
చాయలు సన్నలు ఇంకఁ జాలించవయ్యా

(॥ఏమ॥)
వలపు నాకాయ నీకు వలసీనొల్లములాయ
మలకలబొంకు లిఁక మానవయ్య
పులకలు నావంతు బూటకాలు నీవంతు
నిలువునివ్వెరగులు నీకేలయ్యా

(॥ఏమ॥)
బాగుగఁ గూడేది నాది పై పైఁ జొక్కేది నీది
చేగలనీసరసము చెల్లునయ్య
యీగతి శ్రీవేంకటేశ యిద్దరముఁ గూడితిమి
తీగెనవ్వులెల్లా నేఁడు దిష్టమాయనయ్యా

(||pallavi||)
emannā nāgum̐ bodu ichchagiṁcha nīgum̐ bodu
momu sūsinaṁtalonĕ mŏkkanem̐ṭigayyā

(||ema||)
pāyamĕ nāgu nĕkkĕ paṁtamĕ nīgu nĕkkĕ
seyāra yemainām̐ jeyavayya
kāyamu nāge sĕlavu kām̐kalu nīge sĕlavu
sāyalu sannalu iṁkam̐ jāliṁchavayyā

(||ema||)
valabu nāgāya nīgu valasīnŏllamulāya
malagalabŏṁku lim̐ka mānavayya
pulagalu nāvaṁtu būḍagālu nīvaṁtu
niluvunivvĕragulu nīgelayyā

(||ema||)
bāgugam̐ gūḍedi nādi pai paim̐ jŏkkedi nīdi
segalanīsarasamu sĕllunayya
yīgadi śhrīveṁkaḍeśha yiddaramum̐ gūḍidimi
tīgĕnavvulĕllā nem̐ḍu diṣhṭamāyanayyā