ఏమన్నా హితవేకాక యెగ్గు నాకేలే
(॥పల్లవి॥)
ఏమన్నా హితవేకాక యెగ్గు నాకేలే
కామించి తనుఁ జూడఁగఁ గలిగితేఁ జాలు
(॥॥)
తలఁపులో నున్న వాఁడు తలఁచే నే నెప్పుడైనా
యెలమిఁదా నేడ నున్నా నేమాయనే
వలపు నాకే కద్దు వడి నేఁదన్ను విడువ
చెలఁగి యేపనులైనాఁజేయనీవే తాను
(॥॥)
పెదవి పై నున్నవాఁడు పిలిచే నే నెప్పుడైనా
పొదలి యాకెయింటికిఁ బోయిరానీవే
పదరక నాకుఁబోదు పయికొనేఁగాని నేను
అదనాయ తనతోడిఅలుకేల నాకు
(॥॥)
చేతికి లోనయినాఁడు చెనకే నే నెప్పుడైనా
రాతిరేమి పగలేమి రానియ్యరే
యీతల శ్రీ వేంకటేశుఁ డింతలో విచ్చేసి కూడె
కాతరాన వెనకటికడమేల యిఁకను
(||pallavi||)
emannā hidavegāga yĕggu nāgele
kāmiṁchi tanum̐ jūḍam̐gam̐ galigidem̐ jālu
(||||)
talam̐pulo nunna vām̐ḍu talam̐se ne nĕppuḍainā
yĕlamim̐dā neḍa nunnā nemāyane
valabu nāge kaddu vaḍi nem̐dannu viḍuva
sĕlam̐gi yebanulainām̐jeyanīve tānu
(||||)
pĕdavi pai nunnavām̐ḍu pilise ne nĕppuḍainā
pŏdali yāgĕyiṁṭigim̐ boyirānīve
padaraga nāgum̐bodu payigŏnem̐gāni nenu
adanāya tanadoḍialugela nāgu
(||||)
sedigi lonayinām̐ḍu sĕnage ne nĕppuḍainā
rādiremi pagalemi rāniyyare
yīdala śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalo vichchesi kūḍĕ
kādarāna vĕnagaḍigaḍamela yim̐kanu