Emannaa danage sellunimtegaaga

ఏమన్నా దనకే చెల్లునింతెకాక
Language

(॥పల్లవి॥)
ఏమన్నా దనకే చెల్లునింతెకాక
వోముచు నాపైనేల వొలవేసినే

(॥ఏమ॥)
మనసు నొచ్చీనంటాను మాటలాడకుండఁగాను
తనుఁ గోపించితినంటాఁ దమకించీని
కనుఁగొన సళుపులు కాంతలకు సహజమే
మొనసి మాపైనేల మోపు గట్టీనే

(॥ఏమ॥)
తలఁపు దెలియలేక తలవంచుకుండఁగాను
చలము సాదించెనంటా జంకించీని
అలపులు సొలపులు నంగనలకుఁ గలవే
తొలుతనె మాకునేల దూరు గట్టీనే

(॥ఏమ॥)
తానే వచ్చీనంటాఁ దఁగఁలోననుండఁగాను
నేనే పంతగత్తెనంటా నేర మెంచీని
ఆనవెట్టి శ్రీవేంకటాధిపతి నన్నుఁ గూడె
తేనె వోసి మమునేల తేలించీనె

(||pallavi||)
emannā danage sĕlluniṁtĕgāga
vomusu nābainela vŏlavesine

(||ema||)
manasu nŏchchīnaṁṭānu māḍalāḍaguṁḍam̐gānu
tanum̐ gobiṁchidinaṁṭām̐ damagiṁchīni
kanum̐gŏna saḽubulu kāṁtalagu sahajame
mŏnasi mābainela mobu gaṭṭīne

(||ema||)
talam̐pu dĕliyalega talavaṁchuguṁḍam̐gānu
salamu sādiṁchĕnaṁṭā jaṁkiṁchīni
alabulu sŏlabulu naṁganalagum̐ galave
tŏludanĕ māgunela dūru gaṭṭīne

(||ema||)
tāne vachchīnaṁṭām̐ dam̐gam̐lonanuṁḍam̐gānu
nene paṁtagattĕnaṁṭā nera mĕṁchīni
ānavĕṭṭi śhrīveṁkaḍādhibadi nannum̐ gūḍĕ
tenĕ vosi mamunela teliṁchīnĕ