ఏమనినా నవ్వుదురు యిరుగుపొరుగువారు
(॥పల్లవి॥)
ఏమనినా నవ్వుదురు యిరుగుపొరుగువారు
తామసించఁ బనిలేదు తగులాయఁ బనులు
(॥ఏమ॥)
తెగువలేఁటికి పని తేటతెల్లమైనమీఁద
నగవులేకాక నాకు నీకు
మొగములు చూచితిమి మొక్కులునుఁజేకొంటిమి
తగునిఁక జెప్పవయ్య తఱవాతి పనులు
(॥ఏమ॥)
చెంచలము లేమిటి కిచ్చటఁ జేతికి లోనైతే
మంచివే కాక మనమాటలెల్లాను
మంచమెక్కితిమి తెరమఱగును వేసితిమి
యెంచనేమున్నది మరి యిటమీఁది పనులు
(॥ఏమ॥)
కనుసన్న లేమిటికి కాఁగిటఁ గూడియుండఁగ
మనసులేకమే మనకు నేఁడు
ననిచే శ్రీ వేంకటేశ నమ్మికలు చేకొంటిమి
కొనలుసాగేమే యీ కూడినట్టి పనులు
(||pallavi||)
emaninā navvuduru yirugubŏruguvāru
tāmasiṁcham̐ baniledu tagulāyam̐ banulu
(||ema||)
tĕguvalem̐ṭigi pani teḍadĕllamainamīm̐da
nagavulegāga nāgu nīgu
mŏgamulu sūsidimi mŏkkulunum̐jegŏṁṭimi
tagunim̐ka jĕppavayya taṟavādi panulu
(||ema||)
sĕṁchalamu lemiḍi kichchaḍam̐ jedigi lonaide
maṁchive kāga manamāḍalĕllānu
maṁchamĕkkidimi tĕramaṟagunu vesidimi
yĕṁchanemunnadi mari yiḍamīm̐di panulu
(||ema||)
kanusanna lemiḍigi kām̐giḍam̐ gūḍiyuṁḍam̐ga
manasulegame managu nem̐ḍu
nanise śhrī veṁkaḍeśha nammigalu segŏṁṭimi
kŏnalusāgeme yī kūḍinaṭṭi panulu