(॥పల్లవి॥)
ఏమనిన వడిఁబడు నీవేళను మీ-
రేమాటకైన నిట్టె ఇయ్యకొనరే
(॥ఏమ॥)
చిత్తము గోమలము చిగురింతే దేహము
వొత్తి విన్నవించకురే వోపదు చెలి
గుత్తపురమణి నీపై గోపగించి వున్నదిదె
అత్తి యాకె ఆడినట్టే ఆడరే మీరు
(॥ఏమ॥)
తెగువలే ఘనము దీమసము గొంచము
వొగి నౌఁగాదనకురే వోపదు చెలి
మిగులా విరహమున మేరమీరి వున్నది దె
మొగమిచ్చలే సేసి ముచ్చటాడరే
(॥ఏమ॥)
కూటమి వెగ్గళము కూడపెట్టెఁ జలము
వూరకుండరే మీరు వోపదు చెలి
కోరి శ్రీవేంకటేశుఁ గూడుకొనెఁ దనుఁదానే
చేరిచేరి యిఁదరును సేన చల్లరే
(||pallavi||)
emanina vaḍim̐baḍu nīveḽanu mī-
remāḍagaina niṭṭĕ iyyagŏnare
(||ema||)
sittamu gomalamu siguriṁte dehamu
vŏtti vinnaviṁchagure vobadu sĕli
guttaburamaṇi nībai gobagiṁchi vunnadidĕ
atti yāgĕ āḍinaṭṭe āḍare mīru
(||ema||)
tĕguvale ghanamu dīmasamu gŏṁchamu
vŏgi naum̐gādanagure vobadu sĕli
migulā virahamuna meramīri vunnadi dĕ
mŏgamichchale sesi muchchaḍāḍare
(||ema||)
kūḍami vĕggaḽamu kūḍabĕṭṭĕm̐ jalamu
vūraguṁḍare mīru vobadu sĕli
kori śhrīveṁkaḍeśhum̐ gūḍugŏnĕm̐ danum̐dāne
seriseri yim̐darunu sena sallare