Emanina maamaada yeggulauno tappulauno

ఏమనిన మామాట యెగ్గులౌనో తప్పులౌనో
Language

(॥పల్లవి॥)
ఏమనిన మామాట యెగ్గులౌనో తప్పులౌనో
కామిని వొద్దనె ఇన్నీఁ గందువు రావయ్యా

(॥ఏమ॥)
ముత్తెపుఁ జిప్పలలోన ముంగారు లవె ముంచె
పొత్తుల గాలి నువ్వుఁ బువ్వునఁ బుట్టె
నిత్తుమిది గాలిమాతో నీలిమాటో కానరాదు
అత్తి చెలి ఆనతిచ్చీ ఆడకు రావయ్యా

(॥ఏమ॥)
చెలఁగు నద్దాల మీఁద చిగురు లవె పెట్టె
పులుగు జక్కవలపై పూపులు పూచె
వలరాజుమాయ లివో వలపు మిక్కటమిదో
తలఁచుకొందువు చెలిదండకు రావయ్యా

(॥ఏమ॥)
అందుకోలై దొండపంట నమృతరసము పుట్టె
చిందఁబోసె తీఁగెమీఁద చిమ్ముఁగళలు
అందపు శ్రీవేంకటేశ అంగనఁగూడితి విట్టె
దిందుపడ సతిఁ గూడ దినము రావయ్యా

(||pallavi||)
emanina māmāḍa yĕggulauno tappulauno
kāmini vŏddanĕ innīm̐ gaṁduvu rāvayyā

(||ema||)
muttĕbum̐ jippalalona muṁgāru lavĕ muṁchĕ
pŏttula gāli nuvvum̐ buvvunam̐ buṭṭĕ
nittumidi gālimādo nīlimāḍo kānarādu
atti sĕli ānadichchī āḍagu rāvayyā

(||ema||)
sĕlam̐gu naddāla mīm̐da siguru lavĕ pĕṭṭĕ
pulugu jakkavalabai pūbulu pūsĕ
valarājumāya livo valabu mikkaḍamido
talam̐sugŏṁduvu sĕlidaṁḍagu rāvayyā

(||ema||)
aṁdugolai dŏṁḍabaṁṭa namṛtarasamu puṭṭĕ
siṁdam̐bosĕ tīm̐gĕmīm̐da simmum̐gaḽalu
aṁdabu śhrīveṁkaḍeśha aṁganam̐gūḍidi viṭṭĕ
diṁdubaḍa sadim̐ gūḍa dinamu rāvayyā