ఏమని యెంతునె వల పేరులై పారఁగఁ జొచ్చె
(॥పల్లవి॥)
ఏమని యెంతునె వల పేరులై పారఁగఁ జొచ్చె
కామించి కామించి లో లో కాయము మరచెనే
(॥ఏ మని॥)
పానుపుమీఁదనే వుండి పని గద్దంటాఁ బిలిచి
మానిని విభునిఁ జూచి మనసు దనియదే
పూని పట్టి నవ్వుతాను బుజముపైఁ జేయి వేసి
నానీఁ జెమటనీట నామాఁట వినదే
(॥ఏ మని॥)
ఆరగించి కూరలు చ వాయ నంటాఁ గళ్లు నేసి
చేరి పతి కం దిచ్చి సిగ్గు గొంతాఁ బడదే
పోరచిగా మాఁటలాడి పులకలఁ జిగిరించి
ఆరితేరీ జాము వోయ నంపు మన్నా సంపదే
(॥ఏమని॥)
అట్టె నవ్వులు నవ్వి ఆన లెల్లాఁ బెట్టి పెట్టి
పట్టి శ్రీవెంకటపతిఁ బై కొని తాఁ గూడెనే
నెట్టన నుద్దాలు మెట్టి నిలుచుండి తమకము
మెట్టుక నెరపీఁ గాని మీఁదు కిం దెరఁగదే
(||pallavi||)
emani yĕṁtunĕ vala perulai pāram̐gam̐ jŏchchĕ
kāmiṁchi kāmiṁchi lo lo kāyamu marasĕne
(||e mani||)
pānubumīm̐dane vuṁḍi pani gaddaṁṭām̐ bilisi
mānini vibhunim̐ jūsi manasu daniyade
pūni paṭṭi navvudānu bujamubaim̐ jeyi vesi
nānīm̐ jĕmaḍanīḍa nāmām̐ṭa vinade
(||e mani||)
āragiṁchi kūralu sa vāya naṁṭām̐ gaḽlu nesi
seri padi kaṁ dichchi siggu gŏṁtām̐ baḍade
porasigā mām̐ṭalāḍi pulagalam̐ jigiriṁchi
āriderī jāmu voya naṁpu mannā saṁpade
(||emani||)
aṭṭĕ navvulu navvi āna lĕllām̐ bĕṭṭi pĕṭṭi
paṭṭi śhrīvĕṁkaḍabadim̐ bai kŏni tām̐ gūḍĕne
nĕṭṭana nuddālu mĕṭṭi nilusuṁḍi tamagamu
mĕṭṭuga nĕrabīm̐ gāni mīm̐du kiṁ dĕram̐gade