Emani yaanadichchevo imdugu neevu

ఏమని యానతిచ్చేవో ఇందుకు నీవు
Language

(॥పల్లవి॥)
ఏమని యానతిచ్చేవో ఇందుకు నీవు
వేమరుఁ జెలికత్తెలు విచ్చిచెప్పరాదు

(॥ఏమ॥)
కాంత నీవుం గూడుండఁగా కమ్మటి నొక్కతె రాఁగా
చెంతనే దాఁచుకొంటివి చెరఁగుఁ గప్పి
వింతగా నాకెకొంగు వేరొకవన్నెది సంది-
నంతలోఁ జూచి సందేహము నిన్నడిగె

(॥ఏమ॥)
వీడె మాకె ఇచ్చేవేళ వేరొకచెలి రాఁగాను
వోడక మలఁగుదండ నుంచుకొంటివి
తోడనె యాకెనీడ గోడపై నుండఁగాఁ గని
జోడు గంటి మేడదని సొలసి నిన్నడిగె

(॥ఏమ॥)
కమ్మివీ ణాపె వాఇంచంగా కిమ్ముల సతి రాంగా
సొమ్ములలోఁ బెట్టి యీకె నెమ్మిం గూడితి
పమ్మినయలమేల్ మంగపతివి శ్రీవేంకటేశ
ఇమ్ముల నాకెఁ గని యేమౌనని యడిగె

(||pallavi||)
emani yānadichchevo iṁdugu nīvu
vemarum̐ jĕligattĕlu vichchisĕpparādu

(||ema||)
kāṁta nīvuṁ gūḍuṁḍam̐gā kammaḍi nŏkkadĕ rām̐gā
sĕṁtane dām̐sugŏṁṭivi sĕram̐gum̐ gappi
viṁtagā nāgĕgŏṁgu verŏgavannĕdi saṁdi-
naṁtalom̐ jūsi saṁdehamu ninnaḍigĕ

(||ema||)
vīḍĕ māgĕ ichcheveḽa verŏgasĕli rām̐gānu
voḍaga malam̐gudaṁḍa nuṁchugŏṁṭivi
toḍanĕ yāgĕnīḍa goḍabai nuṁḍam̐gām̐ gani
joḍu gaṁṭi meḍadani sŏlasi ninnaḍigĕ

(||ema||)
kammivī ṇābĕ vāiṁchaṁgā kimmula sadi rāṁgā
sŏmmulalom̐ bĕṭṭi yīgĕ nĕmmiṁ gūḍidi
pamminayalamel maṁgabadivi śhrīveṁkaḍeśha
immula nāgĕm̐ gani yemaunani yaḍigĕ