Emani yaanadichchene yedurumaamta

ఏమని యానతిచ్చెనే యెదురుమాఁట
Language

(॥పల్లవి॥)
ఏమని యానతిచ్చెనే యెదురుమాఁట
వేమారుఁ దనివి దీర వినుపించవే

(॥॥)
కన్నుల మొక్కితి నని కానుక లంపతి నని
విన్నవించితివట వే విభునితోను
తన్నునే పాడినది తమకముతో నున్నది
తిన్ననై తన మనసు తెలిసెనటే

(॥॥)
కడు వలచితినని కాచుకవుందాన నని
తడవితివటవే యాతనితోను
జడిగొనఁ గోరినది జాగరము సేసినది
అడరి తనకే సెలవాయనటవే

(॥॥)
యెదురు చూచితినని యేఁకట నుందాన నని
ముదులకించితివటె ముందె తనతో
యిదే శ్రీవేంకటేశుడు యింతలోఁదా నన్ను గూఁడె
అదన నీవొడఁబాటు లాయనటవే

(||pallavi||)
emani yānadichchĕne yĕdurumām̐ṭa
vemārum̐ danivi dīra vinubiṁchave

(||||)
kannula mŏkkidi nani kānuga laṁpadi nani
vinnaviṁchidivaḍa ve vibhunidonu
tannune pāḍinadi tamagamudo nunnadi
tinnanai tana manasu tĕlisĕnaḍe

(||||)
kaḍu valasidinani kāsugavuṁdāna nani
taḍavidivaḍave yādanidonu
jaḍigŏnam̐ gorinadi jāgaramu sesinadi
aḍari tanage sĕlavāyanaḍave

(||||)
yĕduru sūsidinani yem̐kaḍa nuṁdāna nani
mudulagiṁchidivaḍĕ muṁdĕ tanado
yide śhrīveṁkaḍeśhuḍu yiṁtalom̐dā nannu gūm̐ḍĕ
adana nīvŏḍam̐bāḍu lāyanaḍave