Emani vunnado yee manasu

ఏమని వున్నదో యీ మనసు
Language

(॥పల్లవి॥)
ఏమని వున్నదో యీ మనసు
కోమల మెప్పుడు కొరతే మనసు

(॥ఏమని॥)
ముదిసేటివారల ములిగేటివారల
కదిసిచూచి కలఁగదు మనసు
వదలక యింద్రియవర్గంబులకే
వెదకీ నిదివో వీఱిడి మనసూ

(॥ఏమని॥)
జననమరణముల చరాచరములను
కనియును మీఁ దెఱఁగదు మనసూ
ఘననంసారపు కాణాచులకే
దినదినకాంక్షల దిరిగీ మనసూ

(॥ఏమని॥)
కలగని యటు మేల్కని చూచి తెలిసి
చెలఁగి రెంట నడచీ మనసు
బలిమి శ్రీవేంకటపతి రక్షింపఁగ
కొలిచి యాతనికి కొసరీ మనసూ

(||pallavi||)
emani vunnado yī manasu
komala mĕppuḍu kŏrade manasu

(||emani||)
mudiseḍivārala muligeḍivārala
kadisisūsi kalam̐gadu manasu
vadalaga yiṁdriyavargaṁbulage
vĕdagī nidivo vīṟiḍi manasū

(||emani||)
jananamaraṇamula sarāsaramulanu
kaniyunu mīm̐ dĕṟam̐gadu manasū
ghananaṁsārabu kāṇāsulage
dinadinagāṁkṣhala dirigī manasū

(||emani||)
kalagani yaḍu melgani sūsi tĕlisi
sĕlam̐gi rĕṁṭa naḍasī manasu
balimi śhrīveṁkaḍabadi rakṣhiṁpam̐ga
kŏlisi yādanigi kŏsarī manasū