Emani vunnaamdogaani yippadu tana madilo

ఏమని వున్నాఁడోకాని యిప్పడు తన మతిలో
Language

(॥పల్లవి॥)
ఏమని వున్నాఁడోకాని యిప్పడు తన మతిలో
కామించినదాన నన్నుఁ గరుణించుమనవే

(॥ఏమ॥)
యిచ్చకమాడుదుఁగాని యెంచి వెంగేలాడవే
హేచ్చి తనసుద్దులు యెన్ని విన్నాను
మచ్చికలే సేతుఁగాని మరి నే నలుగనే
కొచ్చి తనమేన నెన్ని గురుతులున్నాను

(॥ఏమ॥)
కడు సంతోసింతుఁగాని కన్నుల జంకించనే
నడుమఁ దా నెవ్వతెతో నవ్వినాను
యెడయక మెత్తుఁగాని యెగ్గులు నేఁబట్టనే
తొడిబడ నెచ్చటఁ బొందులు సేసినాను

(॥ఏమ॥)
వినయమే సేతుఁగాని వెక్కసము చూపనే
పెనఁగుచు రతు లెంత పెంచినాను
యెనసె శ్రీవేంకటేశుఁ డిఁక ననుమానించనే
ననిచి తా నెటువలె నడచినాను

(||pallavi||)
emani vunnām̐ḍogāni yippaḍu tana madilo
kāmiṁchinadāna nannum̐ garuṇiṁchumanave

(||ema||)
yichchagamāḍudum̐gāni yĕṁchi vĕṁgelāḍave
hechchi tanasuddulu yĕnni vinnānu
machchigale sedum̐gāni mari ne nalugane
kŏchchi tanamena nĕnni gurudulunnānu

(||ema||)
kaḍu saṁtosiṁtum̐gāni kannula jaṁkiṁchane
naḍumam̐ dā nĕvvadĕdo navvinānu
yĕḍayaga mĕttum̐gāni yĕggulu nem̐baṭṭane
tŏḍibaḍa nĕchchaḍam̐ bŏṁdulu sesinānu

(||ema||)
vinayame sedum̐gāni vĕkkasamu sūbane
pĕnam̐gusu radu lĕṁta pĕṁchinānu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍim̐ka nanumāniṁchane
nanisi tā nĕḍuvalĕ naḍasinānu