Emani vinnavimtu nidivo naa bhaagyamu

ఏమని విన్నవింతు నిదివో నా భాగ్యము
Language

(॥పల్లవి॥)
ఏమని విన్నవింతు నిదివో నా భాగ్యము
కామించి మీ శరణంటిఁ గమలారమణా

(॥ఏమ॥)
కలది యందరికైతేఁ గర్మఫలము
కెలన నాకైతే నీకృపాఫలము
అల సురలకు మథితామృతము
నెలకొన్న నాకైతే నీనామామృతము

(॥ఏమ॥)
సకలాత్మల బ్రదుకు సంసారమూలము
ప్రకటించ నాకైతే నీ పాదమూలము
వెకలి లోకులరతి వీథివీథిని నా-
త్రికరణరతి నీదివ్యభావవీథిని

(॥ఏమ॥)
రంగుగ బాంధవ మందరకు బంధుజనులందు
సంగతి నాకు నీ భక్తజనులయందు
అంగవించి శ్రీవేంకటాధిప నన్నేలితివి
చెంగట నా ధ్యానము నీ శ్రీమూర్తియందు

(||pallavi||)
emani vinnaviṁtu nidivo nā bhāgyamu
kāmiṁchi mī śharaṇaṁṭim̐ gamalāramaṇā

(||ema||)
kaladi yaṁdarigaidem̐ garmaphalamu
kĕlana nāgaide nīkṛpāphalamu
ala suralagu mathidāmṛtamu
nĕlagŏnna nāgaide nīnāmāmṛtamu

(||ema||)
sagalātmala bradugu saṁsāramūlamu
pragaḍiṁcha nāgaide nī pādamūlamu
vĕgali logularadi vīthivīthini nā-
trigaraṇaradi nīdivyabhāvavīthini

(||ema||)
raṁguga bāṁdhava maṁdaragu baṁdhujanulaṁdu
saṁgadi nāgu nī bhaktajanulayaṁdu
aṁgaviṁchi śhrīveṁkaḍādhiba nannelidivi
sĕṁgaḍa nā dhyānamu nī śhrīmūrdiyaṁdu