ఏమని విన్నవించేను యిట్టివి నీచేఁతలు
(॥పల్లవి॥)
ఏమని విన్నవించేను యిట్టివి నీచేఁతలు
కామించి యేమిసేసినాఁ గానిమ్మనేఁ గాక
(॥ఏమ॥)
పొందుసేసి నన్ను నింతబుజ్జగించేటివాఁడవు
యిందాకాఁనేల ఆపెయింట నుంటివి
మందలించి నాతో మంచిమాట లాడేటివాడవు
విందుకు నాపెచెలిని వెంటనే తేఁదగునా
(॥ఏమ॥)
పైకోని నాకుఁగా నింతబాఁతిపడేటివాఁడవు
ఆకెతోనేల యేకాఁతా లాడితివి
నాకు మోహించితినంటా నమ్మఁబలికేవాఁడవు
యీకడ నాపెవుంగరమేల పెట్టుకొంటివి
(॥ఏమ॥)
పలుమారు నాపై నింత బత్తిసేసేటివాఁడవు
చెలఁగి యాపెవిడేలే సేయవలేనా
అలమేలుమంగపతివైనశ్రీవేంకటేశ్వర
యిల నన్నేలినవాఁడ వీడ కాపెఁ దెత్తురా
(||pallavi||)
emani vinnaviṁchenu yiṭṭivi nīsem̐talu
kāmiṁchi yemisesinām̐ gānimmanem̐ gāga
(||ema||)
pŏṁdusesi nannu niṁtabujjagiṁcheḍivām̐ḍavu
yiṁdāgām̐nela ābĕyiṁṭa nuṁṭivi
maṁdaliṁchi nādo maṁchimāḍa lāḍeḍivāḍavu
viṁdugu nābĕsĕlini vĕṁṭane tem̐dagunā
(||ema||)
paigoni nāgum̐gā niṁtabām̐tibaḍeḍivām̐ḍavu
āgĕdonela yegām̐tā lāḍidivi
nāgu mohiṁchidinaṁṭā nammam̐baligevām̐ḍavu
yīgaḍa nābĕvuṁgaramela pĕṭṭugŏṁṭivi
(||ema||)
palumāru nābai niṁta battiseseḍivām̐ḍavu
sĕlam̐gi yābĕviḍele seyavalenā
alamelumaṁgabadivainaśhrīveṁkaḍeśhvara
yila nannelinavām̐ḍa vīḍa kābĕm̐ dĕtturā