Emani vinnavimchenu yemdaamkaa neegu

ఏమని విన్నవించేను యెందాఁకా నీకు
Language

(॥పల్లవి॥)
ఏమని విన్నవించేను యెందాఁకా నీకు
నేమపు రతులకును నీవు నేనే గుఱుతు

(॥ఏమ॥)
మనసు నీపైఁ బెట్టి మంకుతో నే నుండినాను
యెనసినదాననే నీ వెగ్గుపట్టకు
తనువులు మోచినాను తలఁపులు మోచినాను
నినుపైనపనులకు నీవు నేనే గుఱుతు

(॥ఏమ॥)
వయసు నీకొప్పగించి వద్ద నిద్దిరించినాను
ప్రియురాలనే నీకు భేదముగాదు
క్రియతో సన్న సేసినా కేలువట్టి తీసినాను
నియతపుచేఁతలకు నీవు నేనే గుఱుతు

(॥ఏమ॥)
చన్నుల నిన్ను నొరసి జగడాలఁ బెనఁగినా
నిన్నుఁ గూడినదానననే నేరమెంచకు
మన్నించి శ్రీవేంకటేశ మరిగి నన్నుఁ గూడితి
నిన్ను నన్నుఁ జూచుకొంటే నీవు నేనే గుఱుతు

(||pallavi||)
emani vinnaviṁchenu yĕṁdām̐kā nīgu
nemabu radulagunu nīvu nene guṟudu

(||ema||)
manasu nībaim̐ bĕṭṭi maṁkudo ne nuṁḍinānu
yĕnasinadānane nī vĕggubaṭṭagu
tanuvulu mosinānu talam̐pulu mosinānu
ninubainabanulagu nīvu nene guṟudu

(||ema||)
vayasu nīgŏppagiṁchi vadda niddiriṁchinānu
priyurālane nīgu bhedamugādu
kriyado sanna sesinā keluvaṭṭi tīsinānu
niyadabusem̐talagu nīvu nene guṟudu

(||ema||)
sannula ninnu nŏrasi jagaḍālam̐ bĕnam̐ginā
ninnum̐ gūḍinadānanane neramĕṁchagu
manniṁchi śhrīveṁkaḍeśha marigi nannum̐ gūḍidi
ninnu nannum̐ jūsugŏṁṭe nīvu nene guṟudu