ఏమని విన్నవించేనే యింకాఁ దనకు
(॥పల్లవి॥)
ఏమని విన్నవించేనే యింకాఁ దనకు
నేమముతో నుండఁగా మన్నించీఁ దానే నన్నును
(॥ఏమ॥)
బాసగొననేమిటికి పంతమాడనేమిటికి
సేసవెట్టి పెండ్లాడిన చెలులకును
వాసితోడ నింటిలోన వలపు మీఁదెత్తుకొని
వేసరకుండితే నది విభునికేసెలవు
(॥ఏమ॥)
కల్లబెంచనేమిటికి కాఁతాళించ సేమిటికి
యిల్లాండ్లయినయట్టిఇంతులకును
చల్లఁగాఁ గన్నులఁ జూచి చలపట్టి కొలువులో
నల్లంత నుండఁగాను అతనికే సెలవు
(॥ఏమ॥)
పట్టిపెనఁగ నేఁటికి బయలీఁదించనేఁటికి
పట్టపు దేవుళ్ళయినపడఁతులకు
ఇట్టె శ్రీ వేంకటేశుఁడేలె నన్ను నేఁ దనకు
నెట్టన మొక్కఁగా నితనికి నింతా సెలవు
(||pallavi||)
emani vinnaviṁchene yiṁkām̐ danagu
nemamudo nuṁḍam̐gā manniṁchīm̐ dāne nannunu
(||ema||)
bāsagŏnanemiḍigi paṁtamāḍanemiḍigi
sesavĕṭṭi pĕṁḍlāḍina sĕlulagunu
vāsidoḍa niṁṭilona valabu mīm̐dĕttugŏni
vesaraguṁḍide nadi vibhunigesĕlavu
(||ema||)
kallabĕṁchanemiḍigi kām̐tāḽiṁcha semiḍigi
yillāṁḍlayinayaṭṭiiṁtulagunu
sallam̐gām̐ gannulam̐ jūsi salabaṭṭi kŏluvulo
nallaṁta nuṁḍam̐gānu adanige sĕlavu
(||ema||)
paṭṭibĕnam̐ga nem̐ṭigi bayalīm̐diṁchanem̐ṭigi
paṭṭabu devuḽḽayinabaḍam̐tulagu
iṭṭĕ śhrī veṁkaḍeśhum̐ḍelĕ nannu nem̐ danagu
nĕṭṭana mŏkkam̐gā nidanigi niṁtā sĕlavu