Emani vinnavimchemu yitte kanumgonavayya

ఏమని విన్నవించేము యిట్టె కనుఁగొనవయ్య
Language

(॥పల్లవి॥)
ఏమని విన్నవించేము యిట్టె కనుఁగొనవయ్య
మోమునఁ జేతులలోన మొక్కులున్నవి

(॥॥)
నెలఁతమనసులోన నిండువలపు లున్నవి
సెలవివవ్వులలోన సిగ్గులున్నవి
తలిరుమోవిమీఁద తరితీపు లున్నవి
కలువ కన్నుల లోన కాంక్ష లున్నవి

(॥॥)
అంగనమాటలలోన నడియాస లున్నవి
రంగగుచన్నులపై కరఁగు లున్నవి
అంగపుసేవలలోఁ బ్రియములెల్లా నున్నవి
సింగారంపుఁగొప్పుమీఁద సేస లున్నవి

(॥॥)
కప్పి యలమేలుమంగకాఁగిట నీమేనున్నది
చిప్పిలఁ జెక్కులమీఁద చిహ్న లున్నవి
యిప్పుడె శ్రీ వేంకటేశ యిద్దరునుఁ గూడితిరి
నెప్పున నీకెవేల నీవుంగర మున్నది

(||pallavi||)
emani vinnaviṁchemu yiṭṭĕ kanum̐gŏnavayya
momunam̐ jedulalona mŏkkulunnavi

(||||)
nĕlam̐tamanasulona niṁḍuvalabu lunnavi
sĕlavivavvulalona siggulunnavi
talirumovimīm̐da taridību lunnavi
kaluva kannula lona kāṁkṣha lunnavi

(||||)
aṁganamāḍalalona naḍiyāsa lunnavi
raṁgagusannulabai karam̐gu lunnavi
aṁgabusevalalom̐ briyamulĕllā nunnavi
siṁgāraṁpum̐gŏppumīm̐da sesa lunnavi

(||||)
kappi yalamelumaṁgagām̐giḍa nīmenunnadi
sippilam̐ jĕkkulamīm̐da sihna lunnavi
yippuḍĕ śhrī veṁkaḍeśha yiddarunum̐ gūḍidiri
nĕppuna nīgĕvela nīvuṁgara munnadi